Viral Video: వామ్మో.. దీన్ని డాన్స్ అంటారా తల్లీ..? హీల్స్ వేసుకుని.. చీర కట్టుకుని ఈ యువతి వేసిన డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-05-31T17:30:10+05:30 IST

వేషానికి తగ్గట్టు చేసే పని ఉండాలని అంటూంటారు. ఓ మహిళ చక్కగా చీర కట్టుకుని ఓ ఫంక్షన్ కు వెళ్ళింది. ఆ ఫంక్షన్లో మహిళలు అందరూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్నారు. వారందరూ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడపుతోంటే..

Viral Video: వామ్మో.. దీన్ని డాన్స్ అంటారా తల్లీ..? హీల్స్ వేసుకుని.. చీర కట్టుకుని ఈ యువతి వేసిన డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

అమ్మాయిలు చీరకట్టులో కనిపించినంత అందంగా మరే దుస్తులలోనూ కనిపించరు. ఒకప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా చాలా వెరైటీగా ఉంటుందని ఫ్యాషన్ దుస్తులు ధరించేవారు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.. ఇప్పుడు మళ్ళీ చీరల హవా నడుస్తోంది. విదేశీయులు కూడా చీరకట్టు మీద మోజుపడుతున్నారు. ఓ అమ్మాయి ఓ ఫంక్షన్ కు చీర కట్టుకుని, హీల్స్ వేసుకుని వెళ్ళింది. చక్కగా వెళ్ళింది ఊరికే ఉండక తనలో డ్యాన్స్ ట్యాలెంట్ అందరి ముందు బయటపెట్టింది. ఆమె డ్యాన్స్ వేసిన విధానం చూసి ఫంక్షన్లో వారు ఏమాత్రం ఎంజాయ్ చేశారో తెలియదు కానీ, ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లు మాత్రం నోరెళ్ళబెడుతున్నారు. 'దీన్ని డ్యాన్స్ అంటారా తల్లీ..' అంటూ తల పట్టుకుంటున్ననారు. అందరినీ అంతగా భయపెడుతున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వేషానికి తగ్గట్టు చేసే పని ఉండాలని అంటూంటారు. ఓ మహిళ చక్కగా చీర కట్టుకుని(Women wearing saree) ఓ ఫంక్షన్ కు వెళ్ళింది. ఆ ఫంక్షన్లో మహిళలు అందరూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్నారు. వారందరూ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడపుతోంటే వాళ్ళలో ఉన్న చీరకట్టు అమ్మాయి డ్యాన్స్ చెయ్యడానికి సిద్దమైంది. చీరకట్టులో ఉన్న ఆమె ఏదైనా మెలోడీ లేదా క్లాసికల్ డ్యాన్స్ వేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ మహిళ మాత్రం అందుకు విరుద్దంగా హిప్ హాప్ డ్యాన్స్(women hip hop dance in saree) చెయ్యడం మొదలుపెట్టింది. చీరకట్టులో హిప్ హాప్ చెయ్యడమే కష్టమైతే, దానికి జతగా ఆమె హీల్స్ ధరించడం మరొక విచిత్రం. హిప్ హాప్ డ్యాన్స్ వేస్తూ ఆమె మూవ్స్ ఇస్తోంటే ఆమె చుట్టూ ఉన్న మహిళలు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. డ్యాన్స్ వేస్తున్న అమ్మాయి మాత్రం చీరకట్టుతో తనకు సంబంధమే లేదన్నట్టు రెచ్చిపోయింది. ఈ క్రమంలో ఆమె మూవ్స్ ఇస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడింది కూడా. కానీ తెలివిగా కవరింగ్ చేసి కొనసాగించింది. చివరికి ఆ యువతి తన డ్యాన్స్ సక్సెస్ గా కంప్లీట్ చేసి పక్కకు వెళ్ళిపోయింది.

Wife: నా భార్య కంటే ఆమె అందంగా ఉందా..? అందాల పోటీల వేదికపైనే బీభత్సం సృష్టించిన భర్త..!


ఈ వీడియోను nepalhiphopfoundation.. అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. పేజ్ నేమ్ ను బట్టి డ్యాన్స్ వేసింది నేపాల్(Nepal) అమ్మాయని స్పష్టమవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. 'బాబోయ్ అది డ్యాన్సా.. ఆమె నిజంగానే డ్యాన్స్ వేసిందా?' అని చమత్కారం చేస్తున్నారు. 'ఆమె డ్యాన్స్ వేసినట్టు లేదు, జాతరలో అమ్మవారు పూనకంలోకి వచ్చి ఊగినట్టు ఉంది' అని అంటున్నారు. 'డ్యాన్స్ చేస్తూ ఆమె కిందపడినప్పుడు గాయాలు అయినట్టున్నాయి, ఆమె కవర్ చేసింది' అని ఇంకొకరు అన్నారు.

Viral Video: టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడో వృద్ధుడు.. ఓ కుర్రాడు తన వైపే రావడం చూసి కంగారు.. ట్యాబ్‌లో అతడు చూపించిన ఫొటోను చూసి..!


Updated Date - 2023-05-31T17:30:10+05:30 IST