Viral Video: పెళ్లి వేడుకలో ఫ్రెండ్స్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి అవాక్కైన వధువు.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుని..

ABN , First Publish Date - 2023-04-03T15:30:14+05:30 IST

కష్టాన్ని పంచుకోవాలన్నా.. సంతోషాన్ని అందించాలన్నా ఫ్రెండ్సే మొదటివరుసలో ఉంటారు. ఓ అమ్మాయికి తన మెహందీ వేడుకలో(Mehndi function) ఆమె ఫ్రెండ్స్ ఊహించని విధంగా..

Viral Video: పెళ్లి వేడుకలో ఫ్రెండ్స్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి అవాక్కైన వధువు.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుని..

స్నేహితుల మధ్య ఉండే బంధం గురించి మాటల్లో చెప్పడం కష్టం. తల్లిదండ్రుల దగ్గర కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతోనే పంచుకుంటారు చాలామంది. ఇక స్నేహం కేవలం వయసుకు, జెండర్ కు మాత్రమే పరిమితం కాదు. అమ్మాయిలు అబ్బాయిల మధ్య కూడా చాలా మంచి స్నేహం ఉంటుంది. కష్టాన్ని పంచుకోవాలన్నా.. సంతోషాన్ని అందించాలన్నా ఫ్రెండ్సే మొదటివరుసలో ఉంటారు. ఓ అమ్మాయికి తన మెహందీ వేడుకలో(Mehndi function) ఆమె ఫ్రెండ్స్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.. ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుందంటే ఆమె ఎంత షాకయ్యుండాలో అర్థం చేసుకోండి మరి. అమ్మాయి మెహందీ ఫంక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అని మన తెలుగు సినీకవి సి. నారాయణరెడ్డి గారు రాశారు.. స్నేహం చాలా గొప్పది. ప్రస్తుతకాలంలో దానికి జెండర్ బేధం కూడా లేదు. ఓ అమ్మాయికి మెహందీ వేడుక జరుగుతుండగా ఆమె చిన్ననాటి స్నేహితులు సర్ప్రైజ్ ఇచ్చారు. 2007సంవత్సరంలో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 'హే బేబీ(Hey baby)' అనే సినిమాలో 'మస్త్ ఖలందర్(Mast Kalandar)' అనే పాట ఉంది. ఈ పాట పెళ్ళివేడుకలో భాగంగానే సాగుతుంది. ఎంతో సరదాగా ఉత్సాహంగా సాగే ఈ పాటకు వధువు స్నేహితులు(Bride friends) డాన్స్ చేశారు. ఇద్దరితో మెల్లిగా సాగిన వారి డ్యాన్స్ మూడవ వ్యక్తి ఎంట్రీతో పీక్స్ కు చేరుకుంటుంది. వాళ్ళకు అసలు డాన్సే రాదు.. అలాంటిది కష్టపడి నేర్చుకుని చేశారు. దీంతో అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంది. తన పెళ్ళిలో తన ఫ్రెండ్స్ అంత సంతోషాన్ని క్రియేట్ చేస్తారని ఆమె అస్సలు ఊహించి ఉండదు.

దీపేష్ మెహతా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ the.lord.of.the.light అనే పేజీ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. 'ఆ అమ్మాయి కన్నీళ్ళు.. నీళ్ళు అయి ఉంటే ముంబైలో వరదలు వచ్చేవి' అని క్యాప్షన్ ఇచ్చారు. దీన్నిబట్టి ఈ పెళ్ళివేడుక ముంబైలో జరిగినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎమోషన్ కూడా ఒక్క క్యాప్షన్ తోనే అర్థమైపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి ఫ్రెండ్స్ డాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఈ కుర్రాళ్ళ కొరియోగ్రఫీ భలేఉందని మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ సాంగ్ కు ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు ఇరగదీశారని అంటున్నారు. నేను వందసార్లు చూశాను కానీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. ఏదిఏమైనా అమ్మాయి పెళ్ళి పుణ్యమా అని కుర్రాళ్ళలో అద్భుతమైన డాన్స్ బయటకొచ్చింది.

Read also: ముప్పై ఏళ్ళ తరువాత పక్కాగా ఇవి తీసుకోవాల్సిందే.. లేకపోతే 40ఏళ్ళకే 60లా..


Updated Date - 2023-04-03T15:30:14+05:30 IST