Viral Video: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం.. ఈ జింక తాపీగా నీళ్లు తాగుతోంటే సడన్‌గా..!

ABN , First Publish Date - 2023-06-06T11:40:28+05:30 IST

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా వీడియో కంటే ఆయన వీడియోకు పెట్టిన క్యాప్షన్..

Viral Video: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం.. ఈ జింక తాపీగా నీళ్లు తాగుతోంటే సడన్‌గా..!

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. ఈయన ఎప్పటికప్పుడు కొత్త విషయాలు షేర్ చేయడంతో పాటు తన అనుచరులు ఇన్ప్పైర్ అయ్యేలా పోస్ట్ లు పెడుతుంటారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా వీడియో కంటే ఆయన వీడియోకు పెట్టిన క్యాప్షన్(video caption) ఆయన అనుచరులతో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చిన్నప్పటినుండి నీతి కథలు వింటూ పెరిగిన మనకు మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతాయి. ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి షేర్ చేశారు. వీడియోలో ఓ జింక(deer) నీటి ఒడ్డున నిలబడుకుని తాపీగా నీళ్ళు తాగుతోంది. అయితే నీళ్ళు తాగడానికి వచ్చే ఏదో ఒక జంతువును వేటాడాలని అప్పటికే నీళ్ళలో మొసలి(crocodile) మాటువేసింది. ఆ విషయం జింకకు తెలియక అది చాలా ప్రశాంతంగా నీళ్ళు తాగుతోంది. అప్పుడే ఉన్నట్టుంది మొసలి నీళ్ళలోనుండి రాకెట్ లాగా బయటకు చొచ్చుకువచ్చి జింక మీదకు దూకింది. నీళ్ళు తాగుతున్న జింక మొసలివేగాన్ని రెప్పపాటులో గమనించి వెంటనే అప్రమత్తమైంది. అది ఒక్కసారిగా ఉన్నట్టుండి వెనక్కు గెంతింది. మొసలి కంటే వేగంగా జింక వెనక్కు గెంతడంతో మొసలిబారి నుండి తప్పించుకుంది. జింక స్థానంలో వేరే ఏ జంతువైనా ఉండి ఉంటే అది ఖచ్చితంగా సరెండర్ అయిపోయేదే కానీ జింక మాత్రం అప్రమత్తంగా ఉండి తన ప్రాణాలను కాపాడుకుంది.

Bluetooth: మీ ఫోన్లలో బ్లూటూత్‌ను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే..!


ఈ వీడియోను anand mahindra తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. 'వారం ప్రారంబించేటప్పుడు చాలామంది బద్దకంగా ఉంటారు, కానీ చురుగ్గా ఉండండి' అని అర్థమొచ్చేలా ఆయన క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎప్పటిలానే ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ కు, వీడియోకు కనెక్ట్ అయిపోయారు. 'కార్పోరేట్ సంస్థలలో పనిచేసేవారు ఆ జింకలాగే చురుగ్గా ఉండాలి' అని కామెంట్ చేశారు. 'మహీంద్రా కారులాగే ఆ జింక చురుగ్గా ఉంది' అని చమత్కారం చేస్తున్నారు. 'ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్నవారికి ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Home Making Tips: ఎంత శుభ్రం చేసినా ఈగలు ఇంట్లోంచి వెళ్లడం లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో వాటిని చంపకుండానే పారిపోయేలా చేయొచ్చు..!


Updated Date - 2023-06-06T11:40:28+05:30 IST