Viral Video: వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. కరెంట్ అక్కర్లేదు, చేత్తో ఉతకనక్కర్లేదు.. బట్టలు ఉతకడానికి సరికొత్త ఐడియా..

ABN , First Publish Date - 2023-09-10T13:34:07+05:30 IST

వాషింగ్ మెషిన్ కొనడానికి బోలెడు డబ్బు కావాలి, అలాగే నెలనెలా కరెంట్ బిల్లు కట్టాల్సిందే కానీ ఔట్ డోర్ వాషింగ్ మెషిన్ కు ఇవేవీ అక్కర్లేదు.

Viral Video: వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. కరెంట్ అక్కర్లేదు, చేత్తో ఉతకనక్కర్లేదు.. బట్టలు ఉతకడానికి సరికొత్త ఐడియా..

బట్టలు ఉతకడం చాలా పెద్ద పని. ముఖ్యంగా జీన్స్ లు విస్తృతంగా ధరిస్తున్న ఈ కాలంలో వాటిని ఉతకడానికి చాలా కష్టపడాలి. ఇక చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా, ఉద్యోగాలు చేసేవారు అయినా రోజుకొక జత విప్పేస్తూ బట్టల కుప్ప పేరుస్తుంటారు. ఈ కారణంగానే పట్టణాలలో నివసించే చాలామంది వాషింగ్ మెషిన్లు వాడుతుంటారు. గ్రామాలలోకూడా ఓ మోస్తరు ఇళ్లలో వాషింగ్ మెషిన్లు ఉన్నట్టే. అయితే వాషింగ్ మెషిన్ తో కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడు అవుతుంది. చాకలి వారితో బట్టలు ఉతికించుకోవడం కూడా ఇప్పట్లో వేలరూపాయల వ్యవహారమే. వీటన్నింటికి చెక్ పెట్టే ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఔట్ డోర్ వాషింగ్ మెషిన్' సహాయంతో కరెంట్ బిల్ ఖర్చు లేకుండా హాయిగా ఎన్ని బట్టలు అయినా ఉతుక్కోవచ్చు. అసలు ఈ ఔట్ డోర్ వాషింగ్ మెషిన్ ఏంటి? ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఒకప్పుడు బావుల దగ్గర, చెరువుల దగ్గర బట్టలు ఉతికేవారు(washing clothes). అలాంటి పరిస్థితి నుండి వాషింగ్ మెషిన్ లో సర్ఫ్, డిటర్జెంట్ లిక్విడ్ వేసి ఒక్క బటన్ నొక్కితే బట్టలు వాటికవే వాష్ అయిపోయేంతగా సాంకేతికం అభివృద్ది చెందింది. అయితే వాషింగ్ మెషిన్ కొనడానికి బోలెడు డబ్బు కావాలి, అలాగే నెలనెలా కరెంట్ బిల్లు కట్టాల్సిందే కానీ ఔట్ డోర్ వాషింగ్ మెషిన్(out door washing machine) కు ఇవేవీ అక్కర్లేదు. వీడియోలో చెక్కలతో బుట్ట ఆకారంలో(wood basket) తయారు చేసిన వస్తువును చూడచ్చు. దీన్ని వాలుగా నీరు ప్రవహిస్తున్న చోట సెట్ చేశారు. బుట్ట లోపల అమరిక ఎలా ఉందో కనిపించడం లేదు కానీ పై నుండి నీరు ఆ బుట్టలోకి వెళుతుంటే ఆ బుట్టలో బట్టలు అచ్చం వాషింగ్ మెషిన్ లో తిరిగినట్టు తిరుగుతున్నాయి. బహుశా ఈ బుట్టలోపల చక్రం లాంటి సెట్టింగ్ ఉండవచ్చని అంటున్నారు. ఇది చాలా సహాజంగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో నీటి ప్రవాహాల దగ్గర ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రజలందరూ సామూహికంగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు.

Health Tips: పాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ ఆహారాలతో కలిపి తీసుకుంటే అంతే సంగతులు..ఈ వీడియోను Vala Afshar అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఎంతో అందంగా రూపొందించిన ఔట్ డోర్ వాషింగ్ మెషిన్' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'వాహ్ ఏమి క్రియోటీవిటీ బాస్.. ఎంత బాగుందో' అని ఒకరు కామెంట్ చేశారు. 'పర్యావరణానికి అనుకూలమైన ఈ వాషింగ్ మెషిన్ గ్రామీణ ప్రాంతాలకు భలే ఉపయోగం' అని మరొకరు అన్నారు. 'ఈ ఔట్ డోర్ వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో కానీ దీన్ని తయారుచేసిన వారు నిజంగా గ్రేట్' అని మరొకరు అన్నారు. కాగా 'దీన్ని ఉపయోగించి బట్టలు వాష్ చేయడం వల్ల చాలా నీరు కలుషితమవుతుంది'అని మరికొందరు అంటున్నారు.

Home Remedies For Loose Motion: ఎవరికీ చెప్పుకోలేని ‘విరేచనాల’ సమస్య.. ఈ 10 వంటింటి చిట్కాలను పాటిస్తే..!


Updated Date - 2023-09-10T13:47:58+05:30 IST