Viral Video: నిజమైన హీరోవంటే నువ్వేనయ్యా.. ఒంటె ఓ గొయ్యిలోకి తొంగి చూస్తోందేంటని ఈ వ్యక్తికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2023-04-20T19:23:47+05:30 IST

గొయ్యి చుట్టూ దీనంగా తిరుగుతున్న ఒంటె కనిపించింది. 'అయ్యో పాపం.. ఆ ఒంటె ఎందుకలా తిరుగుతోందో' అని అతను అక్కడికెళ్ళి చూసి షాకయ్యాడు.

Viral Video: నిజమైన హీరోవంటే నువ్వేనయ్యా.. ఒంటె ఓ గొయ్యిలోకి తొంగి చూస్తోందేంటని ఈ వ్యక్తికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

మూగజీవులు తమ సమస్యను నోరు తెరచి చెప్పలేవు. వాటి సమస్యను గుర్తించి సహాయం చేసేవారు నిజంగా చాలా గొప్ప మనసు కలిగినవారు అనిపించుకుంటారు. ఓ వ్యక్తి ఎడారిలో ప్రయాణిస్తున్నాడు. అతనికి ఒక గొయ్యి చుట్టూ దీనంగా తిరుగుతున్న ఒంటె కనిపించింది. 'అయ్యో పాపం.. ఆ ఒంటె ఎందుకలా తిరుగుతోందో' అని అతను అక్కడికెళ్ళి చూసి షాకయ్యాడు. ఆ ఒంటె కోసం చాలా రిస్కే చేశాడు. అతను చేసిన పనికి నెట్టింట ప్రసంశల వర్షం కురుస్తోంది. 'నిజమైన హీరో నువ్వేనయ్యా' అని అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకూ అతనికి కనిపించిందేంటి? అతను చేసిన పనేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

ప్రాంతాలు ఏవైనా.. ప్రజలు ఎక్కడి వాళ్లు అయినా మానవత్వం(humanity) మాత్రం కచ్చితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నోరులేని జీవుల పట్ల జాలి, దయ చూపించేవారు ఎక్కువగానే ఉంటారు. ఎడారిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కొండ గుట్టల చుట్టూ అరుస్తూ తిరుగుతున్న ఒంటె(camel) కనిపించింది. ఆ ఒంటెను చూసిన అతను 'ఏమయ్యింది? ఆ ఒంటె ఎందుకలా అరుస్తోంది?' అని ఆ కొండ గుట్టల దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ కొండ గుట్టల మధ్యలో ఒక గొయ్యి(pit) ఉంది. ఆ గొయ్యిలో పాపం ఒక చిన్న ఒంటె పిల్ల(baby camel) పడిపోయింది. తన పిల్ల గొయ్యిలో పడిపోవడంతో ఏం చెయ్యాలో తోచని తల్లి ఒంటె ఆ గొయ్యి చుట్టూ పిచ్చిదానిలా తిరుగుతూ ఆవేదనతో అరుస్తూ ఉంది. విషయం అర్థమవ్వగానే ఆ బాటసారి ముందు వెనుకా ఆలోచించకుండా ఆ గొయ్యిలోకి దిగాడు. ఆ గొయ్యి మరీ లోతుగా లేకపోయినా ఏమాత్రం కాలు జారినా ఆ బండరాళ్ళమీద కచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ అతను మాత్రం ఒంటె పిల్లను రక్షించడమే ముఖ్యమనే ఆలోచనతో గొయ్యిలోకి దిగాడు. ఆ గొయ్యిలో నుండి ఒంటె పిల్లను బయటకెలా పంపాలో అతనికి మొదట అర్థం కాలేదు.

Viral Video: సైకిల్‌పై వీధుల్లో తిరుగుతూ సమోసాలు అమ్ముతున్న వికలాంగుడు.. ఇంగ్లీషులోనూ మాట్లాడుతోంటే అనుమానం వచ్చి ఓ వ్యక్తి ఆరా తీస్తే..


ఆ గొయ్యిలో అటూ ఇటూ ప్రయత్నం చేసి గొయ్యి మీద రెండు కాళ్లు ఎడంగా పెట్టి నిలబడుకుని ఒక చేత్తో అతను సపోర్ట్ గా నిలబడ్డాడు. మరొక చేత్తో ఆ ఒంటె పిల్లను తన శక్తి కొలది బయటకు తోయడానికి ప్రయత్నం చేశాడు. మొదట ఒంటె పిల్లను అలా తోయడానికి కుదరలేదు కానీ తన బలమంతా ప్రయోగించి దాన్ని ఒంటి చేత్తో ఎత్తుతూ ముందుకు తోశాడు. అతని కష్టం వృధా పోలేదు, ఒంటె పిల్ల క్షేమంగా బయటపడి తన తల్లిని చేరుకుంది. Nature is Amazing అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. 'నిజమైన హీరోవి నువ్వే బ్రదర్' అని అతనిపై ప్రసంశలు కురిపిస్తున్నారు. 'అతను ఆ ఒంటె తల్లీ-పిల్లను కలిపాడు అతను సంతోషంగా ఉండాలి' అని కామెంట్ చేశారు. 'ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం' అని అంటున్నారు.

Viral Video: ఓరి నాయనో.. ఈ అమ్మాయికి ఎంత ధైర్యం.. రెండు పాముల తొకల్ని పట్టుకుని.. వాటితో చెడుగుడు ఆడేసుకుందిగా..!


Updated Date - 2023-04-20T19:23:47+05:30 IST