Viral Video: అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన బామ్మ.. 102ఏళ్ళ ఈ తాత ఏం చేశాడో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-05-07T19:52:04+05:30 IST

ఓ వైపు బామ్మకు అలా ఉంటే, మరొక వైపు 102ఏళ్ళ ఆమె భర్త(102 years old husband) చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Viral Video: అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన బామ్మ.. 102ఏళ్ళ ఈ తాత ఏం చేశాడో మీరే చూడండి..

వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యసమస్యలు రావడం కామన్. దీనికి తగ్గట్టే హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఓ బామ్మగారికి అలాగే అనారోగ్యం చేసింది. పాపం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఓ వైపు బామ్మకు అలా ఉంటే, మరొక వైపు 102ఏళ్ళ ఆమె భర్త(102 years old husband) చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వయసు పెరిగేకొద్దీ అనారోగ్య సమస్యలతో సహవాసం చెయ్యాల్సి వస్తుంది. అయితే ప్రేమించే భాగస్వామి(Loved life partner) ఉంటే ఎంత సమస్యను అయినా సులువుగా అధిగమించవచ్చు. ఓ బామ్మ అనారోగ్యం చేసి ఆసుపత్రి పాలయ్యింది(Old women admitted in hospital). ఆమె భర్త వయసు 102ఏళ్ళు. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, ఆమె హాస్పిటల్ లో ఉందని తెలుసుకుని అంత వయసులోనూ ఆ తాతగారు చాలా గొప్పపని చేశారు. వీడియోలో ఆ తాతగారు హాస్పిటల్ కు వచ్చారు. ఆయన వయసు ప్రభావం వల్ల చాలా బలహీనంగా(weakness), ఒక్కడే నడవడానికి(trouble to walking) ఇబ్బందిగా కూడా ఉన్నారు. కానీ తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి తన పరిస్థితి ఏమాత్రం లెక్కచేయకుండా హాస్పిటల్ కు(old man reached to hospital) చేరుకున్నారు. ఆయన బామ్మగారు ఉన్న గది దగ్గరకు రాగానే ఓ వ్యక్తి ఆయనకు లోపలున్న బామ్మగారిని చూపిస్తూ అదిగో అక్కడున్నారు అంటూ చూపించడం కనిపిస్తుంది. తాతగారు ఆత్రంగా బామ్మ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ప్రేమగా ముద్దుపెట్టుకోవడం చూడచ్చు. ఆ తరువాత ఆ తాతగారు బామ్మ తొందరగా కోలుకోవాలని పూల బోకె అందించి ఆమెను ఊరడించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!


GoodNewsMovement అనే ట్విట్టర్ అకౌంట్(Twitter Account) నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ తాతయ్యల మధ్య ప్రేమకు ఫిదా అవుతున్నారు. 'తాతగారికి బామ్మంటే ఎంత ప్రేమో..' అని కామెంట్స్ పెడుతున్నారు. 'వాళ్ళిద్ధరి మధ్య అంత ప్రేమ ఉంది కాబట్టే వారిద్దరూ ఇంకా జీవించి ఉన్నారు.ఎంత సంతోషంగా ఉంటే అంత కాలం జీవించగలుగుతారు' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'భార్యాభర్తలు బ్రతికున్నంత వరకు ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉంటారు, అదే వివాహబంధంలో ఉన్న గొప్పతనం' అని మరికొందరు అన్నారు. 'వీళ్లిద్దరినీ చూసి నేటితరం చాలా నేర్చుకోవాలి' అని నెటిజన్లు అంటున్నారు.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


Updated Date - 2023-05-07T19:52:04+05:30 IST