Viral News: తెలిసిన కుర్రాడు ఒక్కడే అద్దెకు ఉంటున్నాడని.. కలిసేందుకు భార్యతో సహా వెళ్లిన బంధువుకు షాక్.. తలుపులు తీసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-07T14:38:34+05:30 IST

ఒంటరిగా ఉండే కుర్రాడి గదికి అతని బంధువొకరు ముందుగా చెప్పకుండా భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ గది తలుపులు తీయగానే..

Viral News: తెలిసిన కుర్రాడు ఒక్కడే అద్దెకు ఉంటున్నాడని.. కలిసేందుకు భార్యతో సహా వెళ్లిన బంధువుకు షాక్.. తలుపులు తీసి చూస్తే..!

పొట్టకూటి కోసం పట్టణానికి వెళ్లాడు ఆ కుర్రాడు. అతను అక్కడ కూలి పని చేసుకుంటూ అద్దె గదిలో ఉంటున్నాడు. అతని బంధువొకరు పట్టణానికి భార్యతో కలసి పనిమీద వచ్చాడు. వెళుతూ వెళుతూ అద్దె గదిలో ఉన్న కుర్రాడిని పలకరించి వెళదామని కుర్రాడి గదికి వెళ్లాడు. గది తలుపులు తీసిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చత్తీస్ గడ్(Chhattisgarh) రాష్ట్రం జస్పూర్(Jaspur) జిల్లాలోని బాగీచా పోలీస్ స్టేషన్ పరిధిలో నర్దిహ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంకజ్ అనే కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు తన గ్రామ పరిధిలో పనులేమీ లేకపోవడంతో సంపాదన కోసం చత్తీస్ గఢ్ లోనే ఉన్న అంబికాపూర్(Ambikapur) జిల్లాకు వెళ్లాడు. అక్కడ ఓ గదిలో అద్దెకుంటూ(rent room) కూలీ పనులకు వెళ్ళేవాడు. పంకజ్ మేనమామ తన భార్యతో కలసి అంబికాపూర్ కు పనిమీద వెళ్లాడు. పని ముగిసిన తరువాత మేనల్లుడిని చూసి పలకరించిపోదామని భార్యాభర్తలిద్దరూ డిసైడ్ అయ్యారు. వారిద్దరూ పంకజ్ రూమ్ దగ్గరకువెళ్లి తలుపు కొట్టగా పంకజ్ తలుపు తీయలేదు. 'ఏం పనిచేస్తున్నాడో ఏంటో' అనుకుంటూ పంకజ్ కు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కూడా లిప్ట్ చేయలేదు. వారిలో కంగారు పెరిగింది. పంకజ్ మేనమామ వెంటనే ఓనర్ దగ్గరకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు. దీంతో ఓనర్ గది తలుపులు బద్దలుకొట్టించాడు. తలుపులు బద్దలు కొట్టగానే లోపల షాకింగ్ దృశ్యం కనబడింది.

Marriage: ఆమె టార్చర్‌ను భరించలేకపోయా.. అందుకే చంపేశా.. పెళ్లికి ముందే ఓ వరుడి నిర్వాకమిదీ.. అసలేం జరిగిందంటే..!


గదిలోపల పంకజ్ చీరతో ఫ్యానుకు ఉరి(hanging with saree) వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని అలా చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంకజ్ గదికి వచ్చి చూడగా గదిలో గోడల మీద 'నేను ఇంక తిరిగిరాను, నువ్వు సంతోషంగా ఉండు' అనే వాక్యాలు ఉన్నాయి. అతను ప్రేమలో విఫలమైనందుకే(love failure) ఆత్మహత్యకు(suicide) పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని అతని మరణం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!


Updated Date - 2023-05-07T14:38:34+05:30 IST