Viral News: పాత ఇంటిని కూల్చేస్తోంటే.. గోడల్లో బయటపడిన రూ.50 లక్షల నోట్ల కట్టలు.. ఆనందంతో ఎగిరిగంతేశాడు కానీ.. చివరకు..

ABN , First Publish Date - 2023-05-03T15:57:53+05:30 IST

పైసాకు పైసా పోగు చేసి ఓ సొంతిల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటికి మరమ్మత్తులు చేయిస్తోంటే..

Viral News: పాత ఇంటిని కూల్చేస్తోంటే.. గోడల్లో బయటపడిన రూ.50 లక్షల నోట్ల కట్టలు.. ఆనందంతో ఎగిరిగంతేశాడు కానీ.. చివరకు..

పాపం అతను పేద వ్యక్తి. పైసాకు పైసా పోగు చేసి ఓ సొంతిల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటికి మరమ్మత్తులు చేయించే పనిలో భాగంగా పాత గోడలు కూల్చేస్తోంటే కట్టలకొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. వాటిని చూసి అతను సంతోషంతో ఎగిరి గంతేశాడు. పేదవాడి ఇంటికి మహాలక్ష్మీ నడిచొచ్చిందని అందరూ ఆనందపడ్డారు. కానీ అంతలోపే అతను ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంటిగోడల్లో డబ్బుల కట్టలు బయటపడిన ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పాత ఇళ్ళు కూల్చేస్తున్నప్పుడు, భూమి దున్నుతున్నప్పుడు లంకె బిందెలు(treasure), బంగారు నాణేలు(gold coins) దొరకడం గురించి చాలామంది వినే ఉంటారు. కేవలం మన దేశంలోనే కాదండోయ్ విదేశాల్లో కూడా ఇదే విధంగా నిధులు, నగదు దొరుకుతూంటాయ్. UKలోని నార్త్-వెస్ట్ స్పెయిన్(North-west Spain)లో టోనో పినిరో అనే ఓ పేద వ్యక్తి ఉన్నాడు. అతను ఎప్పటినుండో పోగు చేసిన డబ్బు మొత్తం వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఇంటి గోడలు పాతగా(old walls) ఉండటంతో ఆ ఇంటికి మరమ్మత్తులు చేయించాలని అనుకున్నాడు. అందుకోసం పాత గోడలను కూల్చేస్తోండగా ఆ గోడల్లో కొన్ని డబ్బాలు బయటపడ్డాయి. ఆ డబ్బాలలో ఏముందోనని వాటి మూతలు తీసిన అతనికి పెద్ద షాక్ తగిలింది. ఆ డబ్బాలలో కట్టల కొద్దీ స్పెయిన్ కరెన్సీ(Spain currency) నోట్లు బయటపడ్డాయి. వాటిని లెక్కపెట్టగా 48లక్షలా 14(48.14Lakhs)వేల రూపాయలుగా లెక్కతేలింది.

Bride: పెళ్లయిన మర్నాడే భర్తను ఫోన్ అడిగిన భార్య.. దూరంగా వెళ్లి కంగారుగా మాట్లాడుతోంటే.. అనుమానంతో ఆ భర్త వెళ్లి చాటుగా వింటే..

sp.gif

అయితే తనకు అంత డబ్బు దొరికిందనే ఆనందం అతనికి కొద్దిసేపటిలోనే అదృశ్యమైంది. 1868 నుండి 2002 వరకు ఆ కరెన్సీ స్పెయిన్ అధికారిక కరెన్సీగా చెలామణిలలో ఉంది. ఆ తరువాత ఆ కరెన్సీ కనుమరుగు కావడంతో దాన్ని 2022లో నిషేదించారు. దాన్ని రిడీమ్ చేయడానికి అతను ప్రయత్నించాడు కానీ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్(Bank of Spain) ఆ కరెన్సీ నోట్లను స్వీకరించడం మానేసిందని అతనికి చెప్పారు. నోట్లమార్పిడి గడువు(Currency exchange time out) కూడా ముగిసిందని తెలియడంతో ఆ పేదవాడి మనసులో ఏ మూలో ఉన్న కాస్త ఆశ కూడా నీరుగారిపోయింది. అతనికి డబ్బు లభ్యమైన ఇల్లు దాదాపు 40ఏళ్ల కిందటిదిగా తెలిసింది. ఆ ఇంటి యజమాని డబ్బును కాపాడుకునే ఉద్దేశంతో అలా డబ్బు దాచిపెట్టి ఉంటాడని వారు పేర్కొన్నారు. కాగా ఆ కరెన్సీ నోట్లను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అది అధికారిక కరెన్సీ కాకపోవడం వల్ల అతనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వలేదు. అలాగని బ్యాంకువారికి వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదట. కానీ దాన్ని మెమెంటోగా ఉంచుతామని బ్యాంకు వారు పేర్కొన్నారు. పాపం అసలే పేదవాడైన అతనికి అదృష్టం వచ్చినట్టే వచ్చి వెనక్కు వెళ్ళిపోయిందని అంటున్నారు ఈ విషయం తెలిసినవారు.

Indian Railway: ఎదురుగా ఉన్న రైల్లోని ఓ బోగీలోకి ఉత్కంఠగా చూస్తూ.. ప్లాట్‌ఫామ్‌పై వందల కొద్దీ ప్రయాణీకుల నిరీక్షణ.. అసలేం జరిగిందంటే..!


Updated Date - 2023-05-03T15:57:53+05:30 IST