Viral: స్వర్గంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రెండింతల లాభమంటూ నమ్మించి.. రూ.2.76 కోట్లు కొట్టేశాడు..!

ABN , First Publish Date - 2023-07-17T17:33:50+05:30 IST

డిపాజిట్లు వేసేముందు ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో అందులో వేస్తారు. పాపం ఆమె కూడా అలాగే ఆశ పడింది. అయితే ఆమె డిపాజిట్ వేసింది మాత్రం స్వర్గంలో ఉన్న బ్యాంకులో.

Viral: స్వర్గంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రెండింతల లాభమంటూ నమ్మించి.. రూ.2.76 కోట్లు కొట్టేశాడు..!

డబ్బు ఎక్కువగా చేతిలో ఉన్నప్పుడో లేక భవిష్యత్తు అవసరాల కోసమో బ్యాంకులలో డిపాజిట్ వేస్తుంటారు. ఇలా డిపాజిట్లు వేసేముందు ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో అందులో వేస్తారు. పాపం ఆమె కూడా అలాగే ఆశ పడింది. అయితే ఆమె డిపాజిట్ వేసింది మాత్రం స్వర్గంలో ఉన్న బ్యాంకులో. వినడానికి వింతగానూ, ఆశ్ఛర్యంగానూ అనిపిస్తుంది కానీ, ఇది నిజంగా జరిగిన సంఘటన. అది కూడా వెయ్యి రెండు వేలు కాదు, లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా 2.76కోట్లు. దిమ్మతిరిగిపోయే ఈ మొత్తాన్ని ఆమె ఎలా డిపాజిట్ చేసింది, స్వర్గం గురించి ఎలా నమ్మింది పూర్తీగా తెలుసుకుంటే..

నార్త్ వెస్ట్రన్ స్పెయిన్(Northenwest Spain) లోని లియోన్ ప్రాంతంలో ఎస్పెరాన్జా అనే వృద్దురాలు(Old Women) నివసిస్తోంది. ఆమెకు ఒకసారి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 'చర్చ్ ఆఫ్ హెవెన్(Chruch of Heaven) లో నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టు నీకు రెండింతల లాభం ఉంటుంది' అని అవతలి వ్యక్తి చెప్పారు. అది మాత్రమే కాకుండా 'నువ్వు స్వర్గంలో ఉన్న బ్యాంకులో(bank in Heaven) డిపాజిట్ వేస్తే నీకు స్వర్గంలో ఇంధ్రభవనం లాంటి ఇల్లు కూడా నిర్మిస్తారు' అని చెప్పారు. వేరేవాళ్ళు అయితే ఈ మాటలు కొట్టిపడేసేవాళ్లు, మరికొందరు నవ్వుకునేవాళ్ళు. కానీ ఎస్పెరాన్జా మాత్రం వాటిని లైట్ తీసుకోలేదు. దేవుడే ఆమెకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె నమ్మింది. ఆమెకు 2013లో ఒక సాధువు పరిచయం అయ్యాడు. అతను ఆమెతో పాటు కారులో ఆమె ఇంటికి వెళ్లి, బాత్రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆమె ముందే తన రక్తంతో అక్కడ అద్దం మీద 'నేను నా రక్తాన్ని ఇక్కడే చిందించాను, నువ్వు నా కుమార్తెవు' అనే వాక్యాలు రక్తంతో రాసి, ఆ తరువాత ఆ వాక్యాలు ఆమెతోనే తుడిపించాడు. . అప్పటికే దేవుడంటే ఆమెకు పిచ్చి భక్తి. ఈ సంఘటన తరువాత అది తారాస్థాయికి చేరింది. దీని తరువాతే ఆమెకు పోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లోనే స్వర్గంలో డబ్బు దాటిపెట్టమంటూ ఎవరో చెప్పారు.

Viral Video: అమ్మ బాబోయ్.. దీనికి ఎంత ధైర్యం.. నడిరోడ్డుపై చిరుత పులి కాచుకుని కూర్చుందని చూసి కూడా..!


తనకు పోన్ వచ్చిన తరువాత నుండి ఆమె ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా సుమారు 6 సంవత్సరాల పాటు తనకు దగ్గరలో ఉన్న ఒక సొరుగులో డబ్బు వేసేది. అది స్వర్గంలో ఉన్న బ్యాంకుకు చేరుతుందని నమ్మింది(money deposit in heaven bank). ఆ విషయం ఆమెకు, పోన్ కాల్ లో ఆమెను సంప్రదించిన వ్యక్తికి మాత్రమే తెలుసు. ఆమె దగ్గర డబ్బు లేనప్పుడు బ్యాంకులో రుణం తీసుకుని మరీ ఆమె అందులో జమ చేసింది. ఇలా ఆమె2.76కోట్ల రూపాయలు(2.76crores) ఆ సొరుగులో జమచేసింది. ఆమె బ్యాంకు ఖాతా అంతా ఖాళీ అవ్వడంతో ఆమె పిల్లలకు తల్లిమీద అనుమానం వచ్చింది. దీంతో వారు ఆమెను విచారించారు. ఈక్రమంలోనే విషయం బయటపడింది. కాగా ఎస్పెరాన్జా ఇంటికి దగ్గరలో ఒక వ్యక్తి ఉండేవాడు.అతను దుకాణం నడుపుతూ ఉండేవాడు. అతనే ఆమెను పోన్ లో మభ్యపుచ్చి ఇలా డబ్బు కాజేశాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణంలో పోలీసులకు ఆధారాలు కూడా దొరికాయి. ఈ ఆధారాల వల్ల సదరు దుకాణాదారుడికి 8ఏళ్ళ జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Scooty Video: ఇంటి బయటే స్కూటీని పార్క్ చేస్తున్నారా..? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!


Updated Date - 2023-07-17T17:33:50+05:30 IST