Viral: సోషల్ మీడియాను భయపెడుతున్న ఫోటో.. షాపు బయట కాపలా కాస్తున్న సెక్యురిటీ గార్డుకు తల మిస్సింగ్.. అసలు రహస్యమేమిటంటే....

ABN , First Publish Date - 2023-09-10T17:06:09+05:30 IST

సాదారణంగా సెక్యురిటీ గార్డులు రాత్రి సమయంలో దుకాణాలు, ఇళ్ల బయట కుర్చీలో కూర్చుని ఉంటారు. ఓ షాపు ముందు ఓ వ్యక్తి అలాగే కూర్చుని ఉన్నాడు. కానీ అతని తల కనిపించడం లేదు.

Viral: సోషల్ మీడియాను భయపెడుతున్న  ఫోటో.. షాపు బయట కాపలా కాస్తున్న సెక్యురిటీ గార్డుకు తల మిస్సింగ్.. అసలు రహస్యమేమిటంటే....

సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని భయాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. మరికొన్ని తాము చూస్తున్న నిజమా లేదా అబద్దమా అనే అయోమయంలో పడేస్తాయి. ఈ ఫోటో కూడా ఇప్పుడు అలానే అనిపిస్తోంది. సాదారణంగా సెక్యురిటీ గార్డులు రాత్రి సమయంలో దుకాణాలు, ఇళ్ల బయట కుర్చీలో కూర్చుని ఉంటారు. ఓ షాపు ముందు ఓ వ్యక్తి అలాగే కూర్చుని ఉన్నాడు. కానీ అతని తల కనిపించడం లేదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'అసలతను మనిషేనా? అతని తల ఎక్కడికి పోయింది?' అని అయోమయానికి లోనవుతున్నారు. ఈ ఫోటో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ ప్రపంచంలో చాలా వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే వింత అనేది మనిషి ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అనిపిస్తుంది. ఓ షాపు బయట కుర్చీలో కూర్చుని కాపలా కాస్తున్న సెక్యురిటీ గార్డు(headless security guard photo) ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెక్యురిటీ గార్డు కుర్చీలో కూర్చుని చేతులు రెండు కట్టుకుని ఉన్నాడు. కాళ్లు రెండూ ఒకదానికొకటి పెనవేసి ఆ కాళ్లను చాపుకుని ఉన్నాడు. ఇతని మొండెం మీద ఉండాల్సిన తల కనిపించడం లేదు. సడెన్ గా చూడగానే అందరికీ ఇదే అనిపిస్తుంది. 'అసలతని తల ఎక్కడికి పోయింది?' అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషమేంటంటే ఆ సెక్యురిటీ గార్డ్ నిద్రపోతూ తన తలను వెనక్కు వాల్చాడు. అతను కూర్చున్న ప్లేస్ రహదారికి ఎత్తున ఉండటంతో వెనక్కు వాలిన అతని తల రహదారి మీద ఉన్నవారికి కనిపించడంలేదు. ఫోటో తీసినవారు కూడా చాలా జాగ్రత్తగా అతని తల ఏమాత్రం కనిపించకుండా తీశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రతి ఒక్కరూ అతనికి తల లేదని అనుకుంటున్నారు. కేవలం మొండెం మాత్రమే కాపలా కాస్తోంది. అక్కడున్నది దెయ్యం అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

guard.gif

Viral Video: వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. కరెంట్ అక్కర్లేదు, చేత్తో ఉతకనక్కర్లేదు.. బట్టలు ఉతకడానికి సరికొత్త ఐడియా..



ఈ ఫోటోను Reddit అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో confusing_perspective అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు మొదట భయపడుతున్నారు. ఆ తరువాత దీనివెనుక నిజం తెలిశాక తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'చూసిన వెంటనే నేను అతనికి తల లేదనే అనుకున్నాను. చాలా భయపడ్డాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను తన డ్యూటీ టైమ్ లో నిద్రపోతున్నాడు' అని మరొకరు అతన్ని విమర్శిస్తున్నారు. 'అతను ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. అందుకే వెనక్కు వాలిన అతని తల కనిపించడంలేదు' అని మరొకరు అన్నారు. ఈ ఫోటో చూసిన వెంటనే భయపడేవారే అధికంగా ఉన్నారు.

Viral Video: ఏటీయం ను కొల్లగొట్టడానికి పక్కా ప్లాన్ వేసిన దొంగలు.. కారులో వచ్చి మరీ వీరు చేసిన నిర్వాకం చూస్తే..


Updated Date - 2023-09-10T17:12:55+05:30 IST