Viral: విమానంలో ఓ బొమ్మను మర్చిపోయిందో 9 ఏళ్ల పాప.. 9600 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తిరిగి ఇచ్చేసిన పైలెట్..!

ABN , First Publish Date - 2023-08-30T14:43:51+05:30 IST

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. పొరపాటున వాటిని పోగొట్టుకుంటే చాలా బాధపడతారు. ఈ విషయం బాగా తెలుసేమో ఈ పైలట్ కు ఏకంగా 9600కిమీ ప్రయాణం చేసి మరీ..

Viral: విమానంలో ఓ బొమ్మను మర్చిపోయిందో 9 ఏళ్ల పాప.. 9600 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తిరిగి ఇచ్చేసిన పైలెట్..!

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. వాళ్లు బొమ్మలతో ఆడుకోవడమే కాదు వాటితో మాట్లాడతారు, చర్చిస్తారు, వాటిమీద అలుగుతారు. స్పష్టంగా చెప్పాలంటే పిల్లలకు బొమ్మలు గొప్ప స్నేహితులు. చాలా పదిలంగా వాటిని దాచుకుంటారు. అంత ఇష్టమైన బొమ్మలను కోల్పోవడం పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు. పొరపాటున వాటిని పోగొట్టుకుంటే చాలా బాధపడతారు. అన్నం తినరు, మారం చేస్తారు, అలుగుతారు కూడా. పిల్లల ఈ మనస్తత్వం అతన్ని కుదురుగా ఉండనివ్వలేదేమో ఓ పైటట్ సాహసం చేశాడు. ఒకటి రెండు కాదుఏకంగా 9600కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. కేవలం ఒక చిన్న పాప బొమ్మ ఇవ్వడానికి. ఈ సంఘటన తెలుసుకున్న వారందరూ పైలట్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వాలెంటినా అనే 9ఏళ్ళ బాలిక విమానంలో తన బొమ్మను మరచిపోయింది(girl forgot her doll). అమెరికా(America)లోని టెక్సాస్(Texas) లో నివసిస్తున్న ఆమె తన తల్లిదండ్రులతో కలసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. ఆ తరువాత టెక్సాస్ కు తిరుగుప్రయాణం అయింది. విమానం దిగే హడావిడిలో ఆమె బొమ్మను విమానంలోనే మరచిపోయింది. అయితే ఆ తరువాత పోయిన బొమ్మ గుర్తొచ్చి బాధలో మునిగిపోయింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్(face book) చేసింది. ఈ పోస్ట్ ను జేమ్స్ డాన్నెన్ అనే పైలట్ చూశాడు. నిజానికి జేమ్స్ డాన్నెన్, వాలెంటినా ఇంటికి సమీపంలోనే ఉంటారట. ఆ పాప బొమ్మ పోగొట్టుకున్న విషయం ఫేస్ బుక్ లో చూడగానే ఆయన మనసు కుదురుగా ఉండేకపోయింది. అతను వెంటనే టోక్యో హనెడా ఎయిర్పోర్ట్ లో టర్కిష్ ఎయిర్ లైన్స్ ను సంప్రదించాడు. ఆ బొమ్మ మిస్సైన విమానం గురించి కనుక్కుని 6వేల మైళ్ల దూరంలో ఉన్న విమానాన్ని చేరుకుని ఆ బొమ్మను సేకరించాడు. ఆ తరువాత బొమ్మతో సహా మళ్లీ టెక్సాస్ చేరుకున్నాడు.

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!



బొమ్మ పోయిన దుఃఖంలో మునిగిపోయిన వాలెంటినా ఇంటికి మూడు వారాల తరువాత బొమ్మతో సహా వెళ్లి సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చాడు. తన బొమ్మను చూడగానే వాలెంటినాకు ఎక్కడలేని సంతోషం కలిగింది. ఎంతో ఆనందంగా ఆ బొమ్మను తీసుకుంది. అయితే జేమ్స్ డాన్నెన్ కేవలం ఆ బొమ్మను మాత్రమే కాకుండా జపాన్ కు చెందిన గుర్రం బొమ్మను, మ్యాప్ ను కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. బొమ్మకోసం అంత దూరం ఎందుకు ప్రయాణించావని అతన్ని అడిగితే 'నా స్వభావం ఇంతే.. నేను ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటాను. అలా సహాయం చేస్తే సంతోషం అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ఇతని గురించి విన్న నెటిజన్లు ఇతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?


Updated Date - 2023-08-30T14:43:51+05:30 IST