Viral Video: ఢిల్లీ మెట్రోరైలులో దంపతుల ముద్దూ ముచ్చట్లు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-05-11T10:42:19+05:30 IST

ఢిల్లీ మెట్రోరైలులో ఓ జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

Viral Video: ఢిల్లీ మెట్రోరైలులో దంపతుల ముద్దూ ముచ్చట్లు...వీడియో వైరల్
Couple Kissing Inside Delhi Metro

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలులో ఓ జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీ మెట్రో లోపల ఓ జంట ముద్దుల వర్షం కురిపించిన వీడియో వైరల్ అయింది.(Couple Kissing Inside Delhi Metro)ఢిల్లీ మెట్రో కోచ్ నేలపై కూర్చున్న ఓ యువకుడి ఒడిలో అమ్మాయి పడుకోగా, ఆ యువకుడు ఆమె పెదవులపై ముద్దులు పెడుతూ కనిపించారు.(Viral Video)‘‘ప్రయాణికులు ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడవద్దు’’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC Responds)విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి సంఘటనలు జరిగినపుడు సమీపంలో అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది/సీఐఎస్‌ఎఫ్‌కు వెంటనే తెలియజేయండి, తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చునని మెట్రో అధికారులు చెప్పారు. తేదీ లేని వీడియోపై చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జంటపై చర్య తీసుకోవాలని నెటిజన్లు డీఎంఆర్‌సీ‌ని కోరారు.ఢిల్లీ మెట్రోలో ముద్దుల వీడియోలు గత కొన్ని నెలలుగా వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Wedding: పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా...ఏమైందంటే షాకింగ్

ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్‌లను అనుసరించాలని డీఎంఆర్‌సీ కోరింది.ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే లేదా తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనకూడదు. డీఎంఆర్‌సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా జాబితా చేస్తుంది’’ అని పేర్కొంది.

Updated Date - 2023-05-11T10:50:28+05:30 IST