Wedding: పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా...ఏమైందంటే షాకింగ్

ABN , First Publish Date - 2023-05-11T07:33:45+05:30 IST

పెళ్లి మండపంలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో జరిగింది...

Wedding: పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా...ఏమైందంటే షాకింగ్
Man dies of Heart attack while Dancing

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్‌): ఆడంబరంగా జరిగిన పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది.పెళ్లి మండపంలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో జరిగింది.(Man dies of Heart attack)రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో దిలీప్ రౌజ్కర్ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో (wedding)డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు.(Chhattisgarh) ఈ ఘటన కెమెరాకు చిక్కింది. డోంగర్‌ఘర్‌లో ఒక వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తున్న దిలీప్ రౌజ్కర్ హఠాత్తుగా వేదికపైనే కుప్పకూలిపోయాడు.

ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి దిలీప్ రౌజ్కర్ ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా నివాసి.గుజరాత్ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఇలా గత 45 రోజుల్లో గుండెపోటుతో మరణించడం 8వ సంఘటన.వీడియోలో దిలీప్ రౌజ్కర్ మొదట వేదికపై మరికొంత మందితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.డ్యాన్స్ చేస్తూ అతను అకస్మాత్తుగా ఆగి వేదికపై కూర్చున్నాడు. కొద్ది క్షణాల తర్వాత కుప్పకూలిపోయాడు.దిలీప్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Updated Date - 2023-05-11T09:45:33+05:30 IST