Jio Vs Airtel: రిలయన్స్ జియోకి పోటీగా ఎయిర్‌టెల్ పక్కా ప్రణాళిక.. ఏం చేయబోతోందంటే... లీకైన స్ర్కీన్ షాట్స్

ABN , First Publish Date - 2023-07-18T15:49:33+05:30 IST

దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) ప్రధాన ప్రత్యర్థులనే విషయం విధితమే. మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీల మధ్య చిన్నపాటి యుద్ధమే కొనసాగుతుంటుంది. పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

Jio Vs Airtel: రిలయన్స్ జియోకి పోటీగా ఎయిర్‌టెల్ పక్కా ప్రణాళిక.. ఏం చేయబోతోందంటే... లీకైన స్ర్కీన్ షాట్స్

న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) ప్రధాన ప్రత్యర్థులనే విషయం విధితమే. మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీల మధ్య చిన్నపాటి యుద్ధమే కొనసాగుతుంటుంది. పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో వైర్‌లెస్ పరికరంతో ఫైబర్ తరహా స్పీడ్‌‌తో వైఫై సేవలు అందించేందుకు ‘జియోఎయిర్‌ఫైబర్’ను (JilAirfiber) కంపెనీ ప్రవేశపెట్టింది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ కూడా వైర్‌లెస్ వైఫై సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ 5జీ (Airtel Xstream AirFiber 5G) సమాయత్తమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఎయిర్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ 5జీలో జియో ఫైబర్ మాదిరిగానే వైర్‌లెస్ రూటర్ ఉంటుంది. ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే సరిపోతుంది. ఈ పరికరం దిగువ భాగంలో సిమ్ పెట్టేందుకు స్లాట్ ఇస్తారు. సిమ్ ఇన్‌సర్ట్ చేసిన తర్వాత పవర్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ఇతర ఏ డివైజ్‌లకైనా కనెక్ట్ చేసుకునే సౌలభ్యాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్లను ఎయిర్‌టెల్ ఆఫీషియల్‌గా నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కొన్ని స్ర్కీన్ షాట్లను ఓన్లీ టెక్ అనే వెబ్‌సైట్ షేర్ చేసింది. ఈ స్ర్కీన్ షాట్లను ఓ ఎయిర్‌టెల్ యూజర్ షేర్ చేశాడు.

ఈ స్ర్కీన్ షాట్ల ప్రకారం.. ఎయిర్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ 5జీ పరికరం ఏఆర్ ఫంక్షన్‌ను (AR Function) ఉపయోగించుకుంటుంది. తద్వారా ఇంట్లోని ఏ ప్రదేశంలో 5జీ సిగ్నల్ ఎక్కువగా వస్తుందో గుర్తిస్తుంది. ఈ పరికరంలో మూడు ఇండికేటర్లు ఉంటాయి. ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఇండికేటర్, సెల్యూలర్ నెట్‌వర్క్ ఇండికేటర్, కనెక్టివిటీ ఇండికేటర్ ఉంటాయి. ఇక ధరలు కూడా లీకైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ సర్వీసు రూటర్ రూ.6000గా ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 6 నెలల సబ్‌స్ర్కిప్షన్ విలువ రూ.2,994గా ఉండొచ్చని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వస్తేగానీ అసలు విషయాలు అర్థంకావు.

Updated Date - 2023-07-18T15:53:03+05:30 IST