Share News

Viral Video: ఇది నిజంగా అద్భుతమే.. చెట్టు నుంచి సంగీతం ఎలా వచ్చిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:41 PM

సంగీతానికి ఎంతో శక్తి ఉందని మనం తరచుగా వింటూ ఉంటాం. సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని కొన్ని రోజుల కిందట ఓ అధ్యయనం కూడా వెలువడింది. అయితే చెట్ల కొమ్మల నుంచి సంగీత తరంగాలు బయటకు వస్తాయంటే మీరు నమ్ముతారా?

Viral Video: ఇది నిజంగా అద్భుతమే.. చెట్టు నుంచి సంగీతం ఎలా వచ్చిందో చూడండి.. వీడియో వైరల్!

సంగీతానికి (Music) ఎంతో శక్తి ఉందని మనం తరచుగా వింటూ ఉంటాం. సంగీతం వినిపిస్తే చెట్లు (Tree) బాగా ఎదుగుతాయని కొన్ని రోజుల కిందట ఓ అధ్యయనం కూడా వెలువడింది. అయితే చెట్ల కొమ్మల నుంచి సంగీత తరంగాలు బయటకు వస్తాయంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే నమ్మక తప్పదు. తాజాగా బెంగళూరులోని (Bengaluru) ఓ భారీ వృక్షం కింద కచేరీ జరిగింది. ప్రకృతికి దగ్గరగా ఓ భారీ చెట్టు చుట్టూ స్టేజ్ వేసి డీజే ఏర్పాటు చేశారు (DJ with Tree).

భారతీయ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన కెనడియన్ తరుణ్ నాయర్ (Tarun Nair) ఈ అద్భుతమైన కచేరీ చేశాడు. తన సంగీత పరికరాలను చెట్టుకు అనుసంధానం చేసి సంగీతాన్ని సృష్టించాడు. చెట్టు నుంచి వచ్చిన ఆ ధ్వని చాలా మందిని ఆకట్టుకుంది. ఆ కచేరికి చాలా మంది శ్రోతలు హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియోను taruntspoon అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 3.4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా అద్బుతమే``, ``ప్రకృతితో మమేకమైన సంగీతం``, ``సంగీతానికి ఎల్లలు లేవు``, ``మరపురాని అనుభూతి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 06:41 PM