Viral Video: ఐదేండ్లకు ఇంటికి తిరిగొచ్చిన కొడుకు..ఆమె పరిస్థితి చూసి షాక్..ఆమె కోసం ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2023-06-04T21:26:59+05:30 IST

తల్లిని చంటిపాపలా ఎత్తుకొని ఆలనాపాలనా చూస్తూ ఓ వ్యక్తి మురిసిపోతున్నాడు. ఆ మధుర క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: ఐదేండ్లకు ఇంటికి తిరిగొచ్చిన కొడుకు..ఆమె పరిస్థితి చూసి షాక్..ఆమె కోసం ఏం చేశాడంటే..!

సృష్టికి మూలం అమ్మ. అమ్మ ప్రేమ, త్యాగం వెలకట్టలేనిది. పిల్లల్ని కంటికి పాపలా కాపాడుకోవడంలో అమ్మకు మించిన శక్తి మరొకటి లేదు. బిడ్డలకోసం ప్రాణత్యాగం చేసిన తల్లులున్నారు. అటువంటి అమ్మకు చివరి దశలో తోడుండాల్సి బిడ్డలు వారిని ఒంటరిగా అనాధాశ్రమాల్లో ఒదిలేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన కొడుకులు తన్నితరిమేస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి రాక్షసులన్న ఈ సమాజంలో తల్లిని చంటిపాపలా ఎత్తుకొని ఆలనాపాలనా చూస్తూ ఓ వ్యక్తి మురిసిపోతున్నాడు. ఆ మధుర క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో కేరళకు చెందిన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కేరళ వాసి రోజన్ పరాంబిల్(Rojan Parambil) గత ఐదేళ్లుగా స్విట్జర్లాండ్‌లో(Switzerland) ఉంటున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన రోజన్ క్షీణించిన తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. పరాంబిల్ తల్లిని మోసుకెళ్లి కారులో కూర్చోబెడుతున్న ఈ వీడియోలోని దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎటూ నడవలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిని బయటకు తీసుకెళ్లి ఆనందపర్చేందుకు పరాంబిల్ చేస్తున్న ప్రయత్నం.. మరో మహిళ ఆమెకు కాఫీ అందించగా హ్యాపీగా స్వీప్ చేస్తున్న తల్లితో పరాంబిల్ సెల్ఫీ దిగుతున్న మధుర క్షణాలు ఈ వీడియోలో కనిపిస్తాయి.

తల్లితో ఉన్న అనుబంధాన్ని పరాంబిల్ నెటిజన్లతో ఇలా పంచుకున్నాడు. ‘‘నేను కొన్నేళ్ల క్రితం మా అమ్మను యూరప్ చూపించేందుకు స్విట్జర్లాండ్ తీసుకెళ్లాను. కొత్త ప్రాంతాలను చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీలయింది. కానీ ఐదేళ్ల క్రితం కోవిడ్ కారణంగా ఆమెను ఇండియాకు పంపించాను. ఇప్పుడు మా అమ్మను చూస్తుంటే గుండె బద్దలవుతోంది. తెల్లని జుట్టుతో చాలా ముసలిదానిలా కనిపిస్తోంది. కనీసం నడవలేని స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిని బయటకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యానని’’ పరాంబిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు.

‘‘ఆమెను కారులో అతిరుంపుజా వీధుల్లో తిప్పుతుంటే చాలా సంతోషించింది. కానీ చాలా ప్రాంతాలను ఆమె గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. అయినా చాలా సంతోషించింది. ఆ మధుర క్షణాలను వీడియో తీసి విదేశాల్లో ఉన్న నా తోబుట్టువులకు పంపించాను’’ అని పరాంబిల్ తెలిపాడు.

కేరళలో 12 ఏళ్లకు ఒకసారి పూసే నీలకురింజి పుష్పాన్ని మా అమ్మకు చూపించేందుకు తీసుకెళ్లాను. ఆమె అప్పటికే అలసిపోయింది. అనారోగ్యంతో ఉంది. కానీ ఆ పుష్పాన్ని చూసి ఆమె చాలా సంతోషించిందని’’ ఆ మధుర క్షణాలను పరాంబిల్ నెటిజన్లతో షేర్ చేశాడు.

నేను స్విట్జర్లాండ్‌లో ఓల్డేజ్ హోం నిర్వహిస్తున్న పరాంబిల్ తనకున్న అనుభవంతో తల్లికి అన్ని సపర్యలు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు పరాంబిల్‌ను తెగ పొగిడేస్తున్నారు.

Updated Date - 2023-06-04T21:27:45+05:30 IST