Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!

ABN , First Publish Date - 2023-03-29T16:07:16+05:30 IST

భాషను ఉపయోగించేటపుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ అనర్థాలకు దారి తీస్తాయి. అర్థం తెలియకుండా ఉపయోగించే పదం తలనొప్పులు తెచ్చి పెడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్క్ షీట్.. టీచర్ చేసిన ఘోర తప్పిదాన్ని పట్టించింది.

Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!

భాషను (Language) ఉపయోగించేటపుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ అనర్థాలకు దారి తీస్తాయి. అర్థం తెలియకుండా ఉపయోగించే పదం తలనొప్పులు తెచ్చి పెడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్క్ షీట్.. టీచర్ (Teacher) చేసిన ఘోర తప్పిదాన్ని పట్టించింది. ఆ టీచర్ పాండిత్యంపై చాలా మంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ మార్క్ షీట్ (Mark Sheet) 2019 నాటిది అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

ఆ మార్క్ షీట్ ప్రకారం.. ఆ కుర్రాడు 800కి 532 మార్కులు తెచ్చుకున్నాడు. థర్డ్ గ్రేడ్‌లో పాస్ అయి, క్లాస్‌లో 7వ ర్యాంక్ సాధించాడు. ఆ మార్క్ షీట్‌పై టీచర్.. ``పాస్డ్ అవే`` (Passed away) అని రాశారు. నిజానికి అక్కడ ``పాస్డ్ అవుట్`` అని రాయాలనుకుని ``పాస్డ్ అవే`` అని రాశారు. ``పాస్డ్ అవే`` అంటే ``చనిపోయారు`` అని అర్థం. ఆ విషయం తెలియని టీచర్ పాస్డ్ అవే` అని రాసేశారు. ఆ మార్క్‌ షీట్ ప్రస్తుతం వైరల్ కావడంతో టీచర్‌పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

Gold: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ శనివారం నుంచి కొత్త రూల్.. ఇకపై గోల్డ్ కొనాలంటే..!

2019 నాటి ఆ మార్క్ షీట్ దక్షిణాఫ్రికాలోని ``మలావికి`` చెందినదిగా భావిస్తున్నారు. ఎందుకంటే మార్క్ షీట్‌లో ఉన్న ``చిచెవా`` మలావికి చెందిన అధికారిక భాష. మొత్తానికి టీచర్ చేసిన తప్పు ఎంత అనర్థానికి దారి తీసిందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రియుడు అబద్ధం చెబుతున్నాడని డౌట్.. నేరుగా అతడి ఇంటికే వెళ్తే కనిపించిందో షాకింగ్ సీన్.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..

Updated Date - 2023-03-29T16:07:16+05:30 IST