Solar AC: ఈ ఏసీని చూస్తే ఎగిరి గంతేస్తారు.. ఒక్కరూపాయి కరెంట్ బిల్లు రాదు.. కరెంట్ లేదనే బెంగ అక్కర్లేదు..

ABN , First Publish Date - 2023-03-14T19:40:50+05:30 IST

ఏసీ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ వాటి ధర ఒక ఇబ్బందైతే.. వాటి ద్వారా వచ్చే కరెంటు బిల్లు మరొక ఇబ్బంది. దీనికి చక్కని ప్రత్యామ్నాయం

Solar AC:  ఈ ఏసీని చూస్తే ఎగిరి గంతేస్తారు.. ఒక్కరూపాయి కరెంట్ బిల్లు రాదు.. కరెంట్ లేదనే బెంగ అక్కర్లేదు..

వేసవికాలం అంటే అందరికీ కాస్త భయం. మరీ ముఖ్యంగా ఇన్నేళ్ళలో ఎప్పుడూ లేనంత ఎండలు ఈసారి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేడిగాలులు కూడా విజృంబిస్తాయని అంటున్నారు. దానికి బలం చేకూరుస్తూ ఇప్పటికే ఎండల చిటపట మొదలైంది కూడా.. ఏసీ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ వాటి ధర ఒక ఇబ్బందైతే.. వాటి ద్వారా వచ్చే కరెంటు బిల్లు మరొక ఇబ్బంది. దీనికి చక్కని ప్రత్యామ్నాయం ఇప్పుడు మార్కెట్లో ఉంది. అదే సోలార్ ఏసీ.. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..

వేసవికాలం వచ్చిందంటే.. కూలర్లు, ఏసీల అమ్మకాలు పెరుగుతాయి. ఈ డిమాండ్ కు తగ్గట్టు కంపెనీలు కూడా వీటి ధరలు పెంచుతాయి. కూలర్లకంటే ఏసీలు చాలా మంచి ఆప్షన్. కానీ వేసవిలో ఏసీ వాడకానికి ఈజీగా రెండు నుండి మూడు వేల కరెంట్ బిల్ వస్తుంది. దీన్ని చూసుకుని ఏసీ కొనాలంటేనే జంకుతారు. అలాంటి వారికోసం సోలార్ ఏసీ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. సోలార్ ప్యానెల్ సహాయంతో పనిచేసే ఈ ఏసీలకు కరెంట్ బిల్లు బెడద ఉండదు, కరెంట్ లేదే ఉక్కపోతగా ఉందని బెంగ పడాల్సిన అవసరమూ ఉండదు. ఎంచక్కా మండిపోయే సూర్యుడి ఎనర్జీతో మీ గదిలో చల్లగా నిద్రపోవచ్చు. ఇక ఈ సోలార్ ఏసీ ధరల గురించి చెప్పుకుంటే ఇవి కాస్త ఖరీదే.. వీటి ధరలు మార్కెట్లో లక్ష రూపాయల వరకు ఉంటున్నాయి. ఈ 'ల'కారం వినగానే చాలామంది ఓరినాయనో.. అనుకుంటారు. కానీ ఇది ఒక్కసారి కొంటే జీవితాంతం కరెంట్ బిల్లు లేకుండా నడుస్తుంది. నెలకు మూడు వేల రూపాయలు కరెంట్ బిల్లు ఆదా చేస్తుంది. దీని ప్రకారం చూస్తే సంవత్సరానికి కనీసం 25వేల నుండి 35వేల రుపాయల కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. అందుకే కొనేటప్పుడు ధర అనిపించినా చాలా మంచి సేవింగ్ ఆప్షన్ అంటున్నారు. పెట్టుబడుల గురించి సరైన అవగాహన ఉన్నవారికి దీని ప్రయోజనం తెలుస్తుందని చెబుతున్నారు. గదికి అనుగుణంగా విండో లేదా స్ప్లిట్ ఏసీని ఎంచుకోవచ్చు. ఇది మంచి సేవింగ్ మార్గమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read also: రహస్యంగా రెండో పెళ్ళి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు.. విషయం తెలిసి మొదటి భార్య కోర్టును ఆశ్రయిస్తే జరిగిందిదీ.


Updated Date - 2023-03-14T19:40:50+05:30 IST