Viral Video: మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా? వైరల్ అవుతున్న సూపర్ మ్యాజిక్ ట్రిక్.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-09-10T11:13:32+05:30 IST

మన కళ్ల ముందే అద్భుతంగా కనికట్టు చేసే ఇంద్రజాలికులను ఎంతో మందిని చూసి ఉంటాం. వారు చేసే కొన్ని ట్రిక్కులను కూడా అర్థం చేసుకుంటాం. అయితే చాలా కొద్ది మంది మెజీషియన్స్ ప్రదర్శించే మ్యాజిక్‌లను కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Viral Video: మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా? వైరల్ అవుతున్న సూపర్ మ్యాజిక్ ట్రిక్.. వీడియో వైరల్!

మన కళ్ల ముందే అద్భుతంగా కనికట్టు చేసే ఇంద్రజాలికులను (Magicians) ఎంతో మందిని చూసి ఉంటాం. వారు చేసే కొన్ని ట్రిక్కులను కూడా అర్థం చేసుకుంటాం. అయితే చాలా కొద్ది మంది మెజీషియన్స్ ప్రదర్శించే మ్యాజిక్‌లను (Magic tricks) కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రదర్శించిన టెలీపోర్టేషన్ (Teleportation) మ్యాజిక్ ట్రిక్ చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది (Magic Videos).

ఒక్క అడుగు కూడా వేయకుండా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అదృశ్యమవడాన్నే టెలిపోర్టేషన్ అంటారు. నిజానికి ఇది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తుంటే మాత్రం షాక్ కావాల్సిందే. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక గాజు పెట్టె లోపల కొంత మంది వ్యక్తులను లాక్ చేశారు. ఆ తర్వాత ఆ బాక్స్ నెమ్మదిగా తిరగడం మొదలుపెట్టింది. అంతలో ఓ వ్యక్తి ఆ బాక్స్‌ను కర్టెన్‌తో మేసేశాడు. ఆ బాక్స్‌కు దూరంలో అలాంటిదే మరో ఖాళీ గాజు బాక్స్ ఉంది. దానిని కూడా కర్టెన్‌తో మూసేశారు.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఇలాంటి డైట్‌‌లను మాత్రం ఫాలో కాకండి.. వీటి వల్లే జరిగే అనర్థాలు ఏంటంటే..

కొద్ది సేపటి తర్వాత కర్టెన్లు ఓపెన్ చేయగా మొదటి బాక్స్‌లో ఉండాల్సిన వారు మాయమై రెండో బాక్స్‌లో కనిపించారు. ఇదంతా బహిరంగంగా ఎంతో మంది చూస్తుండగా జరిగింది. ఇది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. leonardo_fisicacuantica అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోకు 8.43 లక్షల వ్యూస్ వచ్చాయి. 30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక, ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2023-09-10T11:13:32+05:30 IST