Shocking Incident: బెడ్‌షీట్లు మారుద్దామని బెడ్రూంలోకి వెళ్లిన మహిళకు కోలుకోలేని షాక్.. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలే పోయేవి..!

ABN , First Publish Date - 2023-03-24T12:47:41+05:30 IST

ఆడుతూ పాడుతూ ఇంటి పని చేసుకుంటూ.. పడక గదిలోకి వెళ్ళి దుప్పట్లు మారుద్దామని దుప్పటి కొద్దిగా తీసింది అంతే..

Shocking Incident: బెడ్‌షీట్లు మారుద్దామని బెడ్రూంలోకి వెళ్లిన మహిళకు కోలుకోలేని షాక్.. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలే పోయేవి..!

చాలామంది ఇంట్లో ఉంటే ఏ ప్రమాదాలు రావని అనుకుంటారు, కానీ దురదృష్టం వెంట ఉంటే ఇంట్లో ఉన్నా ఏదో ఒకటి జరిగి ప్రాణాల మీదకు వస్తుందని కొన్ని సందర్భాలలో ఫ్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఓ మహిళ విషయంలో అదే జరిగింది. ఆడుతూ పాడుతూ ఇంటి పని చేసుకుంటూ పడక గదిలోకి వెళ్ళి దుప్పట్లు మారుద్దామని దుప్పటి తీసింది. అంతే.. ఒక్కసారిగా ఆమె శరీరం ఒణికిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చావు దగ్గరగా వచ్చి పలకరించినట్టు ఫీలైంది ఆ మహిళ.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు పూర్తీగా తెలుసుకుంటే..

ఆస్ట్రేలియా(Australia) దేశంలో క్వీన్స్ లాండ్(Queensland) అనే ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూలుకు వెళ్ళిపోగా ఆమె ఇంటి పని చేసుకుంటోంది. వంట గది పనులు ముగించుకుని పడక గదిలో దుప్పట్లు మారుద్దామని గదిలోకి వెళ్ళింది. గదిలో దుప్పటి తీయగానే దుప్పట్లో ఆరు అడుగుల పొడవుతో దానికి తగ్గ పరిమాణంతో గోధుమరంగులో కనిపించింది పాము. గది లైట్ వెలుతురులో అది మెరిసిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఆ పాము రెండవది. దాన్ని చూడగానే ఆమెకు చెమటలు పట్టి శరీరం వణికిపోయింది. కానీ వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున పరిగెత్తి గదిలోనుండి బయటకు వెళ్ళిపోయింది. లోపలున్న పాము బయటకు రాకుండా తలుపు కింద ఉన్న ఖాళీ భాగంలో టవల్ ను కుక్కేసింది. దీని తరువాత స్నేక్ క్యాచర్స్(Snake catchers) కు సమాచారం అందించింది.

ebs2.gif

కొంత వ్యవధిలోనే స్నేక్ క్యాచర్ ఆమె ఇంటికి చేరుకోగా పాము గదిలో బెడ్ మీద ఉన్నట్టు ఆమె చెప్పింది. స్నేక్ క్యాచర్ గది తలుపు తీసి మెల్లిగా లోపలికి వెళ్ళగా ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్(Eastern brown snake) బెడ్ మీద పడకుని పాములు పట్టే వ్యక్తివైపు చూసింది. దీంతో ఒక్కసారిగా వారి ఒళ్లు జలధరించింది. కానీ అంతలోనే తేరుకుని చాకచక్యంగా పామును పట్టేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా కాగా.. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్ రెండవది. ఈ పాము కాటు వేస్తే క్షణాల్లోనే ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోతాయట. గదిలో వేడిగా ఉండటంతో ఆ ఇంటి వారు గది కిటికి తెరచే ఉంచారు, బయట కూడా వాతావరణం వేడిగా ఉండటంతో పాము తెరచి ఉన్న కిటికి నుండి లోపలికి వచ్చి ఉంటుందని స్నేక్ క్యాచర్ చెప్పారు. తరువాత పామును తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.

Read also: Snake: గుమ్మం ముందే కాపుగాచిన పాము.. రాత్రంతా నిద్రలేకుండా గడిపిన కుటుంబ సభ్యులు.. ఓ బల్ల మీదకు ఎక్కి మరీ..


Updated Date - 2023-03-24T12:47:41+05:30 IST