Share News

Shocking: 7 ఏళ్ల బాలుడికి తీవ్ర జ్వరం.. సడన్‌గా రక్తపు వాంతులు.. ఎక్స్‌రే రిపోర్టు చూసి అవాక్కైన డాక్టర్లు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-09T16:15:24+05:30 IST

పిల్లాడికి జ్వరం వస్తే సాధారణమే అనుకున్నారంతా.. కానీ హాస్పిటల్ కు తీసుకెళ్తే బ.యటపడిన నిజం ఇదీ..

Shocking: 7 ఏళ్ల బాలుడికి తీవ్ర జ్వరం.. సడన్‌గా రక్తపు వాంతులు.. ఎక్స్‌రే రిపోర్టు చూసి అవాక్కైన డాక్టర్లు.. చివరకు..!

పిల్లలకు జ్వరం రావడం సహజం. ఆ పిల్లాడికి కూడా అలాగే జ్వరం వచ్చిందని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆ జ్వరం తీవ్రరూపం దాల్చడంతో కంగారు పడ్డారు. అంతలోనే పిల్లాడు ఉన్నట్టుండి రక్తం వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. రక్తం వాంతులు చూడగానే ఆ తల్లిదండ్రులకు కాలు చెయ్యి ఆడలేదు. పిల్లాడిని తీసుకుని భయాన్ని, బాధను దిగమింగుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు పిల్లాడి పరిస్థితి తెలుసుకుని ఎక్స్ తీయించమన్నారు. తీరా ఆ ఎక్స్ రే రిపోర్టు చూడగానే వైద్యులే అవాక్కయ్యారు. తాము చూసింది నిజమేనా కాదా అని పదే పదే చెక్ చేసుకుని నిజమేనని తేలినతరువాత ఈ పిల్లాడికి వైద్యం మేము చెయ్యలేమంటూ చేతులెత్తేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో(Delhi) ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో నివసిస్తున్న ఓ కుటుంబంలో 7ఏళ్ళ(7 years boy) చిన్నారికి మొదట చిన్నగా జ్వరం వచ్చింది. ఆ తరువాత అది తీవ్రంగా మారింది. పిల్లాడు రక్తం వాంతులు కూడా చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లాడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రిలో పిల్లాడికి ఎక్స్ రే తీయగా ఒక ఊపిరితిత్తిలో సూది(Needle in lung) కనిపించింది. దాన్ని చూడగానే వైద్యులు షాకయ్యారు. అనంతరం పిల్లాడికి తాము చికిత్స చెయ్యలేమని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకెళ్లమని చెప్పారు. పిల్లాడి తల్లిదండ్రులు పిల్లాడిని ఎయిమ్స్ కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. మొదట చికిత్స చేయడం కుదరదని అన్నారు. ఆ తరువాత వైద్యుల బృందం అయస్కాంతం ఉపయోగించి పిల్లాడి ఊపిరితిత్తులలో ఉన్న సూదిని తొలగించవచ్చని చర్చించారు(needle remove from lung with magnet). 4మి.మి వెడల్పు, 1.5మి.మి మందం ఉన్న అయస్కాంతాన్ని ఉపయోగించారు. అది లేకపోతే పిల్లాడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సివచ్చేదని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: Viral: జపాన్ నుంచి వైద్య బృందం.. ఏరికోరి మరీ కేరళలోని ఆ ఆస్పత్రికి ఎందుకు వచ్చింది..? ఓ 9 ఏళ్ల పిల్లాడి విషయంలో..!



ఊపిరితిత్తులలో సూదిని విజయవంతంగా తొలగించామని, సూది తొలగించిన తరువాత పిల్లాడి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. పిల్లలు తమకు తెలియకుండానే వివిధ రకాల వస్తువులు మింగేస్తుంటారని ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని వారు తెలిపారు. గతంలో కూడా 9నెలల చిన్నారి చెవి పోగు, నాలుగేళ్ల పిల్లాడు విజిల్ మింగిన సందర్బాలలో ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా వాటిని బయటకు తీశారు.

ఇది కూడా చదవండి: Viral: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక టీ తాగేందుకు వెళ్లిన డాక్టర్.. 4 గంటల తర్వాత తిరిగొచ్చి..!


Updated Date - 2023-11-09T16:15:26+05:30 IST