Viral News: యూపీలో షర్టు లేకుండా ఆఫీసుకు వెళ్లిన ఉన్నతాధికారి..తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ABN , First Publish Date - 2023-06-14T17:54:17+05:30 IST
సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులకు లేట్‌గా రావడమో..ఆఫీసుల్లో ఉద్యోగులు నిద్రపోవడం, కబుర్లు చెప్పుకోవడం వంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం..వింటుంటాం..కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ అధికారి షర్టు లేకుండా ఆఫీసు వచ్చాడు. ఏకంగా ఉద్యోగులతో వర్చువల్‌గా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాడు. ఆ అధికారి ప్రవర్తన తీరుకు ఉద్యోగులు అసౌకర్యంగా ఫీలయ్యారు. అంతేకాదు అతడిపై విద్యాశాఖ చర్యలు కూడా చేపట్టింది.
లక్నో:సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులకు లేట్‌గా రావడమో..ఆఫీసుల్లో ఉద్యోగులు నిద్రపోవడం, కబుర్లు చెప్పుకోవడం వంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం..వింటుంటాం..కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ అధికారి షర్టు లేకుండా ఆఫీసు వచ్చాడు. ఏకంగా ఉద్యోగులతో వర్చువల్‌గా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాడు. ఆ అధికారి ప్రవర్తన తీరుకు ఉద్యోగులు అసౌకర్యంగా ఫీలయ్యారు. అంతేకాదు అతడిపై విద్యాశాఖ చర్యలు కూడా చేపట్టింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ(Uttar Pradesh Education Department) అధికారి విజయ్ కిరణ్ ఆనంద్(Vijay Kiran Anand)..చొక్కా లేకుండా ఆఫీసు సమావేశానికి హాజరయ్యారు. ఎడ్యుకేషన్ డైరెక్టర్(Director General of Education) హోదాలో ఉన్న విజయ్ కిరణ్ ఆనంద్.. కేవలం ఓ బనియన్ మాత్రమే వేసుకొని ఆన్‌లైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది అక్కడి ఉద్యోగులను విస్మయానికి గురిచేసింది. అధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించిన విజయ్ కిరణ్ ఆనంద్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.