Sara Ali Khan: బ్రేకప్, సినిమాల పరాజయంపై స్పందించిన నటి

ABN , First Publish Date - 2023-03-05T20:55:57+05:30 IST

సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). ‘కేదార్ నాథ్’, ‘సింబా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులతో మెస్మరైజ్ చేసింది.

Sara Ali Khan: బ్రేకప్, సినిమాల పరాజయంపై స్పందించిన నటి

సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). ‘కేదార్ నాథ్’, ‘సింబా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులతో మెస్మరైజ్ చేసింది. ఆమె నుంచి 2020లో అనేక సినిమాలు వచ్చాయి. ‘లవ్ అజ్ కల్ 2’, ‘కూలీ నెం 1’ వంటివి విడుదల అయ్యాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ పరాజయాలపై సారా అలీ ఖాన్ తాజాగా స్పందించింది.

సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఈ బంధానికి 2020లో బీటలు వారింది. వారు విడిపోయారు. బ్రేకప్ అయిన కొన్నాళ్లకే ఆమె నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందువల్ల 2020 తన కెరీర్‌లోనే ఘోరమైన దశ అని సారా అలీ ఖాన్ చెప్పింది. ‘‘నా కెరీర్‌లో 2020 ఘోరంగా ముగిసింది. ఆ ఏడాది బ్రేకప్‌తోనే ప్రారంభమైంది. నేను నటించిన సినిమా పరాజయం కావడంతో అనేక మంది ట్రోల్ చేశారు. వాటిని పట్టించుకునే దశలో కూడా నేను లేను. ఎందుకంటే నా మనసు అప్పుడే ముక్కలైంది’’ అని సారా అలీ ఖాన్ చెప్పింది.

కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ హీరో, హీరోయిన్‌గా నటించిన ‘లవ్ అజ్ కల్-2’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సారా నటనను చాలా మంది విమర్శించారు. ఇక సారా కెరీర్ విషయానికి వస్తే.. విక్కీ కౌశల్‌తో ఓ సినిమా చేస్తుంది. లక్ష్మణ్ ఉత్కేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రాంత్ మస్సేతో కలసి ‘గ్యాస్‌లైట్’ లోను నటిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-05T20:55:57+05:30 IST