SamanthaRuthPrabhu: వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలయింది

ABN , First Publish Date - 2023-02-01T11:17:20+05:30 IST

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా, బుధవారం నాడు ఒక కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అనుసరణగా (Indian adaption) చేస్తున్నారు.

SamanthaRuthPrabhu: వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలయింది

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా, బుధవారం నాడు ఒక కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అనుసరణగా (Indian adaption) చేస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డి.కె. (Director Raj & DK) లు దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళు ఇంతకు ముందు సమంత తో 'ఫామిలీ మేన్' (Family Man) అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇప్పుడు ఈ 'సిటాడెల్' షూటింగ్ మొదలయింది అని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటించారు కూడా. అలాగే సమంత రుత్ ప్రభు కు ఈ 'సిటాడెల్' వెబ్ సిరీస్ కి స్వాగతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చారు. దీనితో సమంత ఆరోగ్యం గురించి ఎటువంటి అనుమానాలు కూడా పెట్టుకోనక్కరలేదు అని కూడా అర్థం అయిపోతోంది.

samantha-new3.jpg

ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ (Amazon) నిర్మిస్తోంది, అదే వెబ్ సిరీస్ ని ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) లు చేస్తున్నారు. రూసో బ్రదర్స్ (Russo Brothers) ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ కోసం తయారు చేశారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్, స్పై థ్రిల్లర్ (Spy thriller) ఇంకా డ్రామా కూడా. ఈ వెబ్ సిరీస్ ని చాల పెద్ద ఎత్తున తీయాలని అనుకుంటున్నారు, అందువలనే, ఇంగ్లీష్ కి ఒక వెర్షన్, ఇండియా ప్రేక్షకులకి ఇండియా వెర్షన్ లో తీస్తున్నారు. ఇండియన్ అనుకరణ కోసం వరుణ్ ధావన్, సమంత ముఖ్య తారాగణం. ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పని చేస్తున్నారు. ఇండియన్ వెర్షన్ షూటింగ్ ఇప్పుడు మొదలయింది ఈమధ్యనే. అయితే రెండూ ఒకేసారి విడుదల చేస్తారా, లేక ఒకదాని తరువాత ఇంకొకటి విడుదల చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

రాజ్, డి.కె. లు దర్శకత్వం లో 'ఫామిలీ మాన్' వెబ్ సిరీస్ నుండి అందరి దృష్టి ఆకర్షించారు. ఆ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. మనోజ్ బాజ్ పాయి అందులో లీడ్ యాక్టర్ కాగా, ప్రియమణి అతని భార్యగా నటించింది. ఇది కూడా స్పై థ్రిల్లర్ గానే వచ్చింది. సమంత ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో చేసింది, చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళతోటే ఈ 'సిటాడెల్' కూడా చేస్తోంది. సాంఘీక మాధ్యమం లో ఒక గ్లామర్ ఫోటో కూడా షేర్ చేసి రాజ్ డి.కె. లు సమంతకి స్వాగతం అంటూ పెడితే, సమంత వాళ్ళకి ప్రేమ గుర్తుని పెట్టింది సమాధానంగా.

Updated Date - 2023-02-01T11:17:22+05:30 IST