Youtubers: ఈ అవ్వల గురించి మాకు తెలుసులేవోయ్ అంటారా.. కొత్తగా తెలుసుకోవాల్సిందేంటంటే..

ABN , First Publish Date - 2023-03-06T15:43:59+05:30 IST

యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సస్ కావడం అంటే ఇప్పటి యూత్‌కి మాత్రమే తెలిసిన పని అనుకుంటే పొరపాటని నిరూపించేశారు.

Youtubers: ఈ అవ్వల గురించి మాకు తెలుసులేవోయ్ అంటారా.. కొత్తగా తెలుసుకోవాల్సిందేంటంటే..
Popular Youtubers in Telugu

వయస్సు కేవలం నంబర్ మాత్రమేనని, దానికి విజయానికి అసలు సంబంధమే లేదని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఈమధ్యకాలంలో సక్సస్ యూట్యూబర్స్‌గా నిలిచిన కొందరు సాధించిన విజయాలను గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం, కాస్త విస్మయం కలగకమానదు. ఈ లేటు వయసులో కాళ్ళు జాపుకుని కూర్చోవలసిన కాలంలో, వీళ్ళు ఏం చేశారో తెలిస్తే‌.. మామూలుగా ఉన్న సౌకర్యాలతో కాలం వెళ్ళదీసేస్తున్న వాళ్ళంతా వీళ్ళను చూసి కాస్త కుళ్ళుకోవాల్సిందే.. విషయంలోకి వెళితే..

ఇప్పటి కాలంలో ఇంట్లో నుంచి చిన్న ఫోన్ సాయంతో తమలోని కళను బయటకు తీయాలని చూస్తున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎందరో.. కొందరు పాటలకు డాన్స్ చేస్తుంటే, మరికొందరు డైలాగ్స్ చెపుతూ పాపులర్ అవుతున్నారు. ఈ కోవకు చెందిన వారే అయినా లేటు వయసులో అంటే దాదాపు వందేళ్ళ వయసులో ఒకరు, పెద్దవయసు వాళ్ళు ఇంకొందరు చేసిన పని చిన్నపనికే అలసిపోయామనే సోమరిపోతులందరినీ నివ్వెరపోయేలా చేసింది. యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సస్ కావడం అంటే ఇప్పటి యూత్‌కి మాత్రమే తెలిసిన పని అనుకుంటే పొరపాటని నిరూపించేశారు. వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఎందరో ఫాలోవర్స్‌ని, పేరుని, డబ్బుని తెచ్చిపెట్టింది. విషయంలోకి వెళితే..

1. కారే మస్తానమ్మ (వంటలు)

కారే మస్తనమ్మ చెఫ్ యూట్యూబర్. దాదాపు తన వందవ యేట‌ యూట్యూబర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తనకు తెలిసిన వంటనే ప్రధానంగా ఎంచుకుంది. అయితే బామ్మ చేసేవన్నీ పాతకాలం నాటి వంటలే కాదు.. కట్లెట్, ఆమ్లెట్, బర్గర్ ఇలా అన్నీ ఎడా పెడా వండి వడ్డించేసింది. దెబ్బకి బామ్మ వంటకి విదేశాల్లోనూ ఫేన్ ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది. అయితే తన ప్రతిభను ముందుగా గుర్తించి ఆమెకు అండగా నిలిచింది మాత్రం మనవడు, అతనే చిన్న ఫోన్‌తో వంట వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టడం మొదలు పెట్టాడు. దెబ్బకు బామ్మకు ఫాలోయింగ్ పెరిగి, వంటలకు ఆదరణ కూడా పెరిగింది. 1.5 మిలియన్లు సబ్కైబర్స్(Subcibers) వచ్చి పడ్డారు. ఇంకేముంది 2016 లో బేంగన్ బార్తా తయారు చేసిన మస్తానమ్మ వీడియో రికార్డింగ్ ఒక సంచలనంగా మారింది. బామ్మకు ఏ వంటన్నా నిముషాల్లో పనని, తనని వంటలో ఫాలో అయిన వాళ్ళయితే చాలామందే ఉన్నారు. 2018లో 107 సంవత్సరాలకు కన్ను మూసింది. అప్పటికే పెద్దవయసు యూట్యూబర్ గానే కాదు, పెద్ద వయసు చెఫ్‌గా కూడా గౌరవాన్ని దక్కించుకుంది మన మస్తానమ్మ.

2. మిల్కురి గంగవ్వ (నా గ్రామం)

మిల్కూరి గంగవ్వ తెలంగాణ జగిటియల్ జిల్లాలోని లాంబాడిపల్లి గ్రామానికి చెందింది. ఆమె తన గ్రామీణ మూలాలను ముఖ్యంగా తీసుకుని, పాపులర్ అయింది. వ్యవసాయ కూలీగా పని చేస్తూనే గంగవ్వ తెలుగు భాషను, తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యంతో కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. అల్లుడు శ్రీకాంత్ శ్రీరాంతో చేరి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని కేంద్రీకరించే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, పాపులర్ అయింది. ఈ యూట్యూబ్ ఛానల్, మై విలేజ్ షో తో మొదలై, ఓట్ షవర్స్ ఇచ్చిన ఫిల్మ్ ప్రమోషన్లతో మారుమోగిపోతుంది. ఈ ప్రతిభతోనే తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ కు కూడా ఎంపికైంది మన గంగవ్వ. ఈ మధ్యకాలంలో గంగవ్వ సినిమా తెరకూ పరిచయం అయింది. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయురాలిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. గంగవ్వకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఈమె గురించి ఆ విషయం తెలిశాక ఊరంతా షాక్..!

3. నారాయణ్ రెడ్డి (తాత కిచెన్)

నారాయణ రెడ్డి మంచి భారీ భోజనాన్ని వడ్డించే షెఫ్‌గా పేరుతెచ్చుకున్నాడు. అంతే కాకుండా తన వంటగది విశాలమైన బహిరంగ ప్రదేశమే కావడం ఇంకా పాపులర్ అయ్యేలా చేసింది. తన ఛానల్ నుంచి వచ్చే ఆదాయంతో వంటచేసి అనాధలకు, నిరుపేదలకు అందించేవాడు. అలా 2017లో ప్రారంభమైన యూట్యూబ్ జర్నీ మూడు నెలల్లోనే 6 మిలియన్ల సబ్క్రైబర్స్ ని తెచ్చిపెట్టింది. అయితే 2017లో నారాయణ రెడ్డి తన 73 సంవత్సరాల వయసులో కన్నుమూసాడు. అయితే అతని ఛానల్ ని బంధువులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎందరో పేదలకు అన్నదానం చేస్తున్నారు. ‌

narayana.jpg

4. సావిత్రమ్మ (మైనా స్ట్రీట్ ఫుడ్)

సాంప్రదాయ పద్దతుల్లో వంటచేయడం అంటే ఇప్పటివారికి చాలా నచ్చే విషయం. దానినే ప్రధానంగా తీసుకుని ఈ దంతాలు లేని బామ్మ తన లేటు వయసులో యూట్యూబర్ గా మంచి పేరు, గుర్తుంపు రెండూ తెచ్చుకుంది. మచిలిపట్నం సావిత్రమ్మ మట్టి కుండలు, కట్టెలను ఉపయోగించి ఇంటి తరహా వంటలు చేయడంలో ప్రసిద్ది చెందింది. సావిత్రమ్మ దగ్గర బంధువుల సాయంతో యూట్యూబ్ ఛానెల్‌లో ప్రవేశించింది. బామ్మ వీడియోలు వైరల్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు చాలా తక్కువ సమయంలోనే ప్రతిభావంతులైన తెలుగు యూట్యూబర్‌లలో ఒకటిగా మారింది. ఎందరికో స్పూర్తిగా నిలిచింది సావిత్రమ్మ.

Updated Date - 2023-03-06T16:31:39+05:30 IST