RRR: తారక్‌కు ఆస్కార్ రావాలంటున్న హాలీవుడ్ మ్యాగజైన్!

ABN , First Publish Date - 2023-01-20T16:33:33+05:30 IST

హాలీవుడ్ మ్యాగజైన్ యుఎస్ఏ టుడే ఉత్తమ నటనను కనబరిచిన 10మంది నటీ, నటుల జాబితాను వెల్లడించింది. వారికి ఆస్కార్ వస్తే బాగుంటుందని చెప్పింది. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం విశేషం.

RRR: తారక్‌కు ఆస్కార్ రావాలంటున్న హాలీవుడ్ మ్యాగజైన్!

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రూ. 1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలోను నిలిచిన సంగతి తెలసిందే. ప్రస్తుతం అకాడమీ సభ్యులు ఓటును వేస్తున్నారు. జనవరి 24న నామినేషన్స్‌ను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ మ్యాగజైన్ యుఎస్ఏ టుడే ఉత్తమ నటనను కనబరిచిన 10మంది నటీ, నటుల జాబితాను వెల్లడించింది. వారికి ఆస్కార్ వస్తే బాగుంటుందని చెప్పింది. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం విశేషం.

‘ఆర్ఆర్ఆర్’ లో కొమురం భీమ్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించాడు. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో క్రూర జంతువులతో పోరాడి ఆకట్టుకున్నాడు. కొమురం భీముడో పాటలో అయితే కెరీర్ ఉత్తమ ప్రదర్శనను ఇచ్చాడు. అందువల్ల అకాడమీ సభ్యులు ఉత్తమ నటుడి కేటగిరిలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ నామినేషన్ ఇవ్వాలని హాలీవుడ్ మ్యాగజైన్ కోరింది. కొమురం భీముడో సాంగ్‌లో తారక్ చేసినట్టు ఏ నటుడు కూడా చేయలేడని రాజమౌళి గతంలోనే చెప్పాడు. ఎన్టీఆర్‌ కనుబొమ్మలపై మనం కెమెరా పెడితే వాటితోనూ నటించగలడని పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-20T16:37:34+05:30 IST