Viral Photo: మూడేళ్ల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి వచ్చింది మంచి ఫొటో షాట్... ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-06-09T21:08:41+05:30 IST
బ్రెజిల్‌లో ప్రసిద్ధ క్రీస్తు విగ్రహం‘క్రైస్ట్ ది రిడీమర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన జనీరోలోని కోర్కోవాడో శిఖరం వద్ద ఈ భారీ విగ్రహం ఉంది. అయితే ఓ ఫొటోగ్రాఫర్ ఈ విగ్రహానికి సంబంధించి అద్భుతమైన షాట్ క్లిక్ మనిపించాడు. ఇప్పుడు అది నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రెజిల్‌లో(Brazi) ప్రసిద్ధ క్రీస్తు విగ్రహం(Colossal Statue of Jesus) ‘క్రైస్ట్ ది రిడీమర్(Christ The Redeemer) గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన జనీరోలోని(Janeiro) కోర్కోవాడో శిఖరం( Mount Corcovado) వద్ద ఈ భారీ విగ్రహం ఉంది. 1931లో నిర్మించిన ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ విగ్రహానికి సంబంధించి అద్భుతమైన షాట్(Stunning Shot Of The Statue) క్లిక్ మనిపించాడు ఓ ఫొటోగ్రాఫర్. ఇప్పుడు అది నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ షాట్ తీసేందుకు ఆ ఫొటోగ్రాఫర్ దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడంటే..ఆ ఫొటోషాట్ ఎంత అద్భుతమైనదో చెప్పొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం ‘క్రైస్ట్ ది రెడీమర్’కు సంబంధించిన అరుదైన ఫొటోలను చూద్దాం రండి..
ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే.. చంద్రుణ్ణి బారుగా చాచిన చేతులపై క్రీస్తు మోస్తున్నట్లు కనిపించడం. నిజంగా క్రీస్తు మోసాడా అన్నట్లు ఉంటుంది ఆ ఫోటో షాట్. తర్వాత మెల్లగా కిందికి దిగిపోతున్నట్లు కనిపిస్తుంది. మూడేళ్లుగా ఆ షాట్ తీసేందుకు ప్రయత్నిస్తున్న బ్రెజిల్‌కు చెందిన ఫొటోగ్రాఫర్.. అంతా సవ్యంగా జరగడంతో చివరగా జూన్ 4న పర్ఫెక్టుగా షాట్ తీయగలిగాడు. విగ్రహానికి ఏడు మైళ్ల దూరంలో ఉన్న నిటెరోయ్‌లోని రియో డి జనోరో మున్సిపాలిటిటోని ఇకారై బీచ్ నుంచి షాట్ తీశానని ఫొటోగ్రాఫర్ పోస్ట్‌లో తెలిపాడు. చాలాకాలంగా ఎదురు చూస్తున్న షాట్ క్లిక్ చేయడంతో ఫొటోగ్రాఫర్ చాలా సంతోషించాడు.
ఈ అద్భుతమైన ఫొటోను ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 6.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కామెంట్లు, లైకులతో ఫొటోగ్రాఫర్‌ను ప్రశంసిస్తున్నారు. ‘‘నేను ఇప్పటివరకు చంద్రునికి సంబంధించిన అనేక చిత్రాలు చూశాను.. కానీ చిరస్మరణీయమైన రీతిలో ఖచ్ఛితమైన కోణంలో ఈ ఫొటొను చిత్రీకరించారు. అద్భుతంగా ఉంది. ’’ అంటూ ఓ నెటిజన్ రాశాడు.
కాగా..ప్రసిద్ధ క్రీస్తు విగ్రహం ‘క్రైస్ట్ ది రిడీమర్’ 98 అడుగుల పొడవు, అడ్డంగా చాచిన చేతులు 92 అడుగులు.. దీనిని రీఎన్స్‌ఫోర్డ్స్ కాంక్రీటుతో నిర్మించారని ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాలో తెలియజేయబడింది. దీని బేస్ 26 అడుగుల చతురస్రాకారంపు రాతి పీఠం ఉంటుందని, ఆర్ట్ డెకో మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పమని బ్రిటానికా తెలిపింది.