Viral Video: అన్ని కుక్కలూ ఒకేలా ఉండవు.. వెంటాడి కరిచేవి కొన్నయితే.. ఇలా ప్రేమను పంచేవి ఇంకొన్ని..!

ABN , First Publish Date - 2023-06-21T16:45:46+05:30 IST

ఇటీవలి కాలంలో చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల దాడిలో ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్నారి మరణించిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు.

Viral Video: అన్ని కుక్కలూ ఒకేలా ఉండవు.. వెంటాడి కరిచేవి కొన్నయితే.. ఇలా ప్రేమను పంచేవి ఇంకొన్ని..!

ఇటీవలి కాలంలో చిన్న పిల్లలపై కుక్కలు (Dogs) దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల దాడిలో ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్నారి మరణించిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు. అయితే అన్ని కుక్కలూ ఒకేలా ఉండవు. చిన్న పిల్లలు కనబడితే వెంటబడి కరిచే కుక్కల శాతం చాలా స్వల్పంగా ఉంటుంటి. కొన్ని కుక్కలు చిన్న పిల్లల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తాయి (Dog Videos).

చిన్న పిల్లలతో సరదాగా ఆడుకునే కుక్కలు ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ పెంపుడు కుక్క నిరాశ్రయురాలైన ఓ అనాథ బాలికతో సరదాగా ఆడుకుంటోంది. theboxertuffy అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ పెంపుడు కుక్క ఓ ఇంట్లో ఉంటుంది. గేటు ఇవతల ఓ బాలిక ఉంది. ఆ బాలికతో కుక్క బంతాట ఆడింది. ఆ బాలిక బాల్ విసిరితే ఆ కుక్క క్యాచ్ పట్టుకుంటోంది. కుక్క బంతిని పట్టుకున్న ప్రతిసారీ ఆ బాలిక ఆనందంతో గెంతులేస్తోంది (Pet dog seen playing with homeless girl).

Sonu Sood: సోనూ సూద్ పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరు..? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అంటూ నెటిజన్ల కామెంట్స్ వెనుక..!

హృదయాన్ని కదిలించే ఈ వీడియోను సోషల్ మీడియా జనాలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 82 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``జంతువులకు కల్మషం ఉండదు. అవి మీ బట్టలు, ఆర్థిక స్థితిని బట్టి మిమ్మల్ని అంచనా వేయవు", ``ఆ గేటు బయట ``కుక్క ఉంది జాగ్రత్త`` అనే బోర్డు ఉంది. కానీ, ఆ కుక్క చాలా క్యూట్‌గా ఉంది``, ``చాలా పవిత్ర స్నేహం`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-21T16:45:46+05:30 IST