PKSDT: సెట్స్‌లో మేనల్లుడిని ఖుషి చేసిన పవర్ స్టార్.. ఇది చాలంటూ..

ABN , First Publish Date - 2023-02-28T18:54:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం..

PKSDT: సెట్స్‌లో మేనల్లుడిని ఖుషి చేసిన పవర్ స్టార్.. ఇది చాలంటూ..
PKSDT Sets

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘PKSDT’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు. రీసెంట్‌గానే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. అంతేకాదు, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషి చేశారు.

PKSDT-3.jpg

సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్ర టీజర్‌ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్.. టీజర్ చూసిన అనంతరం మేనల్లుడినే కాకుండా.. చిత్ర బృందం మొత్తాన్ని ప్రశంసించారు. దీంతో ‘విరూపాక్ష’ టీమ్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

PKSDT-2.jpg

‘విరూపాక్ష’ చిత్రానికి వస్తే.. ఈ చిత్ర గ్లింప్స్‌ని ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) విడుదల చేశారు. తాజాగా టీజర్‌ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ మాత్రం మార్చి 1న యూట్యూబ్‌లో అఫీషియల్‌గా విడుదల కానుంది. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

PKSDT-4.jpg

ఇక మామయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు అందుకున్న సాయిధరమ్ తేజ్.. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘‘ఇంతకంటే ఎక్కువగా ఇంకేం అడగలేను. ‘విరూపాక్ష’ చిత్రం నాకెంతో కీలకమైన చిత్రం. నా గురూజీతో ఇటువంటి క్షణాన్ని షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కల్యాణ్ మామమ్య మీ ప్రేమకి, అభినందనలకి.. అలాగే ఎప్పుడూ నా కోసం నిలబడుతున్నందుకు ధన్యవాదాలు..’’ అని సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘PKSDT’ సినిమా విషయానికి వస్తే.. తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’ (Vinodhaya Sitham)కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.


ఇవి కూడా చదవండి

*********************************

Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-28T19:23:12+05:30 IST