NASA: భూమివైపు దూసుకొస్తున్న 22 అణుబాంబులతో సమానమైన ఆస్టరాయిడ్.. ఏ సంవత్సరంలో ఢీకొట్టే ఛాన్స్ ఉందంటే..

ABN , First Publish Date - 2023-10-04T18:55:31+05:30 IST

ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది.

NASA: భూమివైపు దూసుకొస్తున్న 22 అణుబాంబులతో సమానమైన ఆస్టరాయిడ్.. ఏ సంవత్సరంలో ఢీకొట్టే ఛాన్స్ ఉందంటే..

న్యూయార్క్: ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది. అది 2182 వ ఏడాది సెప్టెంబర్ 24న భూమిని ఢీ కొట్టే ఛాన్స్ ఉంది. దానికి శాస్త్రవేత్తలు బెన్నూ(Bennu) అనే పేరు పెట్టారు.


ఆ గ్రహశకలం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎత్తుగా ఉంటుందని వారు తెలిపారు. ఆ శకలం భూమిని తాకితే 12 వందల మెగా టన్నుల శక్తి విడుదలవుతుంది. అంటే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధం కంటే 24 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని వెల్లడించారు. బెన్నూ ప్రతి 6 ఏళ్లకొకసారి భూమికి సమీపంలోకి వెళ్తోందని..1999లో తొలిసారి, 2005, 2011లలో రెండు, మూడు సార్లు అది భూ గ్రహానికి దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం అది భూమి నుంచి 4.65 మిలియన్ మైళ్ల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బెన్నూ సౌర వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలాల్లో ఒకటిగా ఉంది. దానితో పాటు 1950 DA అనే మరో గ్రహశకలం ఉంది.

Updated Date - 2023-10-04T18:55:31+05:30 IST