Nandamuri Balakrishna అంటే ఆ మాత్రం ఉంటది మరి..మీ అభిమానం సల్లగుండా..

ABN , First Publish Date - 2023-02-25T09:25:11+05:30 IST

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మామూలు హీరో కాదు. ఆయన కోసం ప్రాణాలు పెట్టే అభిమానులు(fans) ఎందరో ..

Nandamuri Balakrishna అంటే ఆ మాత్రం ఉంటది మరి..మీ అభిమానం సల్లగుండా..

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మామూలు హీరో కాదు. ఆయన కోసం ప్రాణాలు పెట్టే అభిమానులు(fans) ఎందరో ఉన్నారు. తాజాగా ఒక అభిమాని చేసిన పని ప్రపంచవ్యాప్తంగా(Worldwide) చర్చనియాంశం అయ్యింది. పెండ్లీ పత్రికలపై ముద్రించిన బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్(NTR) చిత్రాలు చూస్తున్నారు కదా. ఈ అభిమానికి వారే దేవుళ్లు. రెండేళ్ల కిందట ఈ అభిమానికి నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లికి బాలకృష్ణ రావాలన్న కోరికతో నేటి వరకు వివాహం చేసుకోకుండా ఎదురు చూస్తున్న వైనం దివంగతనేత నందమూరి తారకరామారావు(Nandamuri Tarakara Rao) అంటే ఎంతో అభిమానం తెలుస్తోంది.

ఆయనను కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అభిమానాన్ని అంతటితో వదిలేయకుండా..జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి ఘట్టంలో కూడా వధూవరులతో పాటు బాలయ్య చిత్రాన్ని అభిమానంతో చాటుకున్నారు. విశాఖ జిల్లా(Visakha District) పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామానికి చెందిన..పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్ అభిమాని. ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలి పెద్ది నాయుడికి కూడా బాలయ్య అంటే ఎంతో అభిమానం. ఆ మధ్య అతడికి పెళ్లి కుదిరింది. మార్చి 11న వివాహం చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి పిలుపు కోసం ముద్రించిన 6 పేజీల ఆహ్వాన పత్రికపై బాలయ్య, ఎన్టీఆర్ చిత్రాలను ముద్రించి నందమూరి తారకరామారావు గారి దివ్య ఆశిస్సులతో అంటూ రాసుకొచ్చారు.

మార్చి 11న జరగబోయే వివాహ వేడుకలో నందమూరి తారకరామారావు, బాలకృష్ణ 40 అడుగుల కటౌట్ కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్న పెళ్లివారు.. వివాహానికి విచ్చేసిన అతిథుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాలకృష్ణ ఫోటోతో ఉన్న గొడుగులను కానుకగా ఇవ్వడానికి రెడీ చేశారు. వారి కళ్లన్నీ అఖండ బాలయ్య కోసమే. అంతా బాలయ్య ఆశిస్సుల కోసమే.. ప్రస్తుతం వివాహ ఆహ్వానం అందుకుంటున్న అతిథులు దానిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. బాలయ్య రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-02-25T10:20:15+05:30 IST