ఏ మాసంలో, ఏ రోజున, అదికూడా ఏ సమయంలో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయో.. తేల్చిచెప్పేసిన శాస్త్రవేత్తలు!
ABN , First Publish Date - 2023-04-12T10:35:25+05:30 IST
యూఎస్‌లోని ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్(Indiana University School of Medicine)కు చెందిన సైకియాట్రిస్ట్‌లు ఆత్మహత్య(suicide)లకు సంబంధించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు.
యూఎస్‌లోని ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్(Indiana University School of Medicine)కు చెందిన సైకియాట్రిస్ట్‌లు ఆత్మహత్య(suicide)లకు సంబంధించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు. పౌర్ణమి(full moon) సమయంలో ఆత్మహత్య ఘటనలు పెరుగుతాయని వారు ఒక అధ్యయనం(study)లో కనుగొన్నారు. పౌర్ణమి సమయంలో ఏర్పడే కాంతి ఆత్మహత్యలు పెరగడానికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.
శరీరం, మనసు, ప్రవర్తనల(behaviors) జీవ గడియారాన్ని నిర్ణయించడంలో పరిసర కాంతి(Ambient light) ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మనిషి నిద్ర, మేల్కొనే సమయాలను కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రి చీకటిగా ఉన్నప్పుడు పౌర్ణమిలో కాంతి పెరుగుదల మనుషులను ప్రభావితం చేస్తుంది. పరిశోధకుల బృందం(team of researchers) 2012- 2016 మధ్య ఇండియానా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఆత్మహత్యల డేటాను విశ్లేషించింది. పౌర్ణమి ఉండే వారంలో ఆత్మహత్యలు(Suicides) పెరుగుతాయని వారు కనుగొన్నారు. విశేషమేమిటంటే 55 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయట.
ఆత్మహత్యలు జరిగిన సమయం, నెలలను పరిశీలిస్తే... మధ్యాహ్నం(afternoon) 3 నుండి 4 గంటల మధ్య, అలాగే సెప్టెంబర్ నెలలో అత్యధికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సమయంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఏ బయోమార్కర్లు(Biomarkers) ఉన్నాయో తెలుసుకునేందుకు పరిశోధకులు వారి రక్త నమూనాలను సేకరించారు. విశ్లేషణలో ఒక జన్యువును ఆత్మహత్యలకు కారణంగా గుర్తించారు. ఈ జన్యువు(gene) శరీరంలోని జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది. మద్యపాన వ్యసనం(Alcohol addiction) లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు ఈ సమయంలో ఆత్మహత్యలు చేసుకున్నారని పరిశోధకులు తెలిపారు.
అయితే దీనిపై మరికొంత లోతైన అధ్యయనం(study) అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు, కాగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య ఆత్మహత్యలు(Suicides) చేసుకోవడం అనేది అలసటకు సంబంధించినదై ఉండవచ్చని గుర్తించారు. ఇక సెప్టెంబర్(September)లో అత్యధిక ఆత్మహత్యలు చోబు చేసుకోవడానికి ఆ సమయంలో కొన్ని దేశాల్లో వేసవి సెలవులు ముగియడంతో పలువురు ఒత్తిడి(stress)కి గురవుతారని పరిశోధకలు తెలిపారు.