Mobile Charging: జెట్ స్పీడ్‌లో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అవాలా..? ఈ 4 టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే సరి..!

ABN , First Publish Date - 2023-10-06T15:11:07+05:30 IST

అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు తొందరగా ఛార్జింగ్ అయిపోతే బాగుండు అని కూడా అనిపిస్తుంది. ఈ నాలుగు టిప్స్ పాటిస్తే రాకెట్ స్పీడ్ లో ఛార్జింగ్ ఎక్కుతుంది

Mobile Charging: జెట్ స్పీడ్‌లో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అవాలా..? ఈ 4 టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే సరి..!

స్మార్ట్ ఫోన్ సగటు మనిషి జీవితంలో భాగమైపోయింది. ఒకపూట తిండి అయినా లేకుండా ఉండగలుగుతారేమో కానీ ఫోన్ వెంట లేకపోయినా, దాంట్లో ఛార్జింగ్ లేకపోయినా విపత్తు వచ్చినంత కంగారు పడిపోతారు. కానీ ఫోన్ లు కొన్న కొత్తలో ఉన్నంత స్పీడ్ గా పనిచేయడం, బ్యాటరీ స్పీడ్ గా ఛార్జింగ్ కావడం జరగదు. సాధారణ పరిస్థితులలో ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించదు కానీ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు, ల్యాప్టాప్, సిస్టమ్ ముందు పనిచేస్తున్నప్పుడు మాత్రం నిజంగా అతిపెద్ద సమస్యగా అనిపిస్తుంది. తొందరగా ఛార్జింగ్ అయిపోతే బాగుండు అని కూడా అనిపిస్తుంది. కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు నాలుగే నాలుగు చిట్కాలు పాటించడం వల్ల మొబైల్ రాకెట్ స్పీడ్ లో ఛార్జ్ అవుతుంది(smart phone speed charging tips). అవేంటో తెలుసుకుంటే..

ఫోన్ కవర్..(phone cover)

ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ సెక్యురిటీని దృష్టిలో ఉంచుకుని ఫోన్ కవర్ వాడతారు. కానీ ఫోన్ కవర్ కారణంగా మొబైల్ వేడి బయటకు వెళ్లదు. దీనికారణంగా ఫోన్ ఛార్జింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ చాలా స్పీడ్ గా ఎక్కాలంటే ఫోన్ కవర తీసేసి ఛార్జింగ్ పెట్టి చూడండి. ఎంత స్పీడ్ గా ఎక్కుతుందో చూసి ఆశ్చర్యపోతారు.

Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!



ఎరోప్లేన్ మోడ్..(Aeroplane mode)

ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ గా ఎక్కాలంటే ఎరోప్లేన్ మోడ్ లో ఉంచడం మంచిది. నెట్వర్క్ సేవల నుండి యాప్స్ పనిచేయడం వరకు ప్రతి ఒక్కటి ఆగిపోతాయి. బ్యాటరీ వినియోగం ఆగిపోతే ఛార్జింగ్ లో బ్యాటరీ వేగం పుంజుకుంటుంది.

ఫోన్ స్విచ్ ఆఫ్..(phone switch off)

ఛార్జింగ్ స్పీడ్ గా ఎక్కాలంటే ఎరోప్లేన్ మోడ్ మాత్రమే కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కూడా మంచి మార్గం. కనీసం డిస్ప్లే కూడా బ్యాటరీని వినియోగించదు కాబట్టి అత్యవసరంగా బయటకు వెళ్లే అవసవరం ఉన్నప్పుడు కొద్దిసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టచ్చు.

వాల్ సాకెట్..(wall socket)

కంప్యూటర్, ల్యాప్టాప్ ముందు పనిచేస్తున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ లేనప్పుడు చాలామంది ల్యాప్టాప్, కంప్యూటర్ లోయుఎస్బి పోర్ట్ ఉపయోగిస్తుటారు. కానీ దీంతో ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది. దీనికి పరి,్కారంగా వాల్ సాకెట్ ను ఉపయోగించవచ్చు. దీనివల్ల వేగంగా ఛార్జింగ్ ఎక్కుతుంది.

Maths Puzzle: ప్రభుత్వోద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే మీరు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నట్టే లెక్క..!


Updated Date - 2023-10-06T15:19:52+05:30 IST