Shocking: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. వైరల్ అవుతున్న పెళ్లి వీడియో!

ABN , First Publish Date - 2023-07-02T15:27:32+05:30 IST

ఇటీవలి కాలంలో వెరైటీ పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పురుషులు మనువాడడం, తనను తానే పెళ్లి చేసుకోవడం వంటి విచిత్ర వివాహాల గురించి వింటున్నాం. అయితే మెక్సికోలో ఓ నగరానికి మేయర్ అయిన వ్యక్తి ఓ ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు.

Shocking: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. వైరల్ అవుతున్న పెళ్లి వీడియో!

ఇటీవలి కాలంలో వెరైటీ పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పురుషులు మనువాడడం, తనను తానే పెళ్లి చేసుకోవడం వంటి విచిత్ర వివాహాల గురించి వింటున్నాం. అయితే మెక్సికో (Mexico)లో ఓ నగరానికి మేయర్ (Mayor) అయిన వ్యక్తి ఓ ఆడ మొసలి (Alligator)ని పెళ్లి చేసుకున్నాడు. మేయర్ అత్యంత ప్రమాదకరమైన మొసలిని పెళ్లాడం చూసి బంధు,మిత్రులు సంబరాలు చేసుకున్నారు. వివాహం అనంతరం ఆ మొసలిని మేయర్ ముద్దు పెట్టుకుని, దానితో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. ఆ మేయర్ ఇలా చేయడం వెనుక ఓ కారణం ఉందట.

మెక్సికోలోని సాన్ పెడ్రో హువా మెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో సోనా, అలిసియా అడ్రియానా అనే ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకకు ముందు ఆ మొసలిని నగరంలోని ఇంటింటికీ తీసుకు వెళ్లారు. అనంతరం ఆ మొసలికి తెలుపు వస్త్రం తొడిగి టౌన్‌హాల్‌కు తీసుకెళ్లి వరుడికి అందించారు. మేయర్ ఆ మొసలిని సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధమైన సంగీతానికి వధూ వరులు నాట్యం చేశారు. మొసలి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ వివాహానికి ముందు మొసలి మూతికి ప్లాస్టర్ వేశారు (Mexican Mayor marries alligator).

Shocking: కదులుతున్న బస్సులో కండక్టర్ అసభ్యకర చర్య.. ప్యాసింజర్‌తో శృంగారం.. వీడియో తీసిన ప్రయాణికులు!

మేయర్ విక్టర్ మెక్సికోలోని పురాతన ఛోంతాల్ తెగకు చెందిన వారు. ఈ తెగలో పాలకులు ఆడ మొసలిని పెళ్లాడడం ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయంగా కొనసాగుతోంది. తమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, వారికి అదృష్టం కలగాలని కోరుకుంటూ ఛోంతాల్ తెగ రాజులు మొసలిని వివాహం చేసుకునేవారు. ఇప్పుడు మేయర్ తన పట్టణ ప్రజలకు అదృష్టం తీసుకురావాలనే ఉద్దేశంతో మొసలిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. 230 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2023-07-02T15:27:32+05:30 IST