Share News

Viral Video: ఏం ఐడియా బాసూ.. సోఫాను ఎలా మార్చేశారో చూడండి.. క్రియేటివిటీ చూసి షాకైన ఆనంద్ మహీంద్రా!

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:07 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఫన్నీగా అనిపించిన వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అలాగే ఎవరైనా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తే వారిని అభినందిస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు.

Viral Video: ఏం ఐడియా బాసూ.. సోఫాను ఎలా మార్చేశారో చూడండి.. క్రియేటివిటీ చూసి షాకైన ఆనంద్ మహీంద్రా!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఫన్నీగా అనిపించిన వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అలాగే ఎవరైనా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తే వారిని అభినందిస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది (Viral Video). ఆ వీడియోలో ఇద్దరు యువకులు ఓ సోఫాను (Sofa) వాహనంగా (Vehicle) మార్చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు ఆన్‌లైన్ ద్వారా సోఫాను ఆర్డర్ చేశారు. ఆ సోఫాకు చక్రాలు, మోటార్ అమర్చారు. తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఆ సోఫాను ఓ వెహికల్‌గా మార్చేశారు. అనంతరం దానిపై ఇద్దరూ కూర్చుని ఊరంతా ప్రయాణించారు. అది కేవలం వారు సరదాగానే చేసినా, వారి నైపుణ్యం, ఆటోమొబైల్ స్కిల్స్ మాత్రం సామాన్యులనే కాదు.. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తను కూడా ఆకట్టుకున్నాయి. వారిని ప్రశంసిస్తూ ఆయన్ ట్వీట్ చేశారు.

``ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్ట్. కానీ, దానిని తయారు చేయడంలో వార పెట్టిన శ్రద్ధ, ఆటోమొబైల్ స్కిల్ మాత్రం అమోఘం. ఒక దేశం ఆటోమొబైల్ రంగంలో దిగ్గజంగా మారాలంటే ఇలాంటి సృజనాత్మక ఇంజినీర్లు కావాలి. ఇలాంటి వాహనాన్ని భారత్‌లో రిజిస్టర్ చేయడానికి ఆర్టీవో ఆఫీస్‌కు తీసుకెళితే అక్కడ అధికారి ఎలా ఫీల్ అవుతాడో చూడాలని ఉంద``ని ఆనంద్ కామెంట్ చేశారు. కాగా, ఆనంద్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో 4.5 లక్షల వ్యూస్ దక్కించుకుంది.

Updated Date - Dec 31 , 2023 | 12:07 PM