Share News

Viral Video: అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువకులు.. వారి చేతుల్లో ఏమున్నాయంటే..

ABN , Publish Date - Dec 17 , 2023 | 03:52 PM

ఆ ముగ్గురు కుర్రాళ్లు తమ ఫ్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కొద్ది సేపటికి ఆ లిఫ్ట్ ఆగిపోయింది. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా అది పని చేయలేదు. చివరకు తమ పక్క ఫ్లాట్ వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దాదాపు అర్ధగంట తర్వాత అపార్ట్‌మెంట్ సిబ్బంది లిఫ్ట్ డోర్‌లు తెరిచారు.

Viral Video: అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువకులు.. వారి చేతుల్లో ఏమున్నాయంటే..

ఆ ముగ్గురు కుర్రాళ్లు తమ ఫ్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ (Lift) ఎక్కారు. కొద్ది సేపటికి ఆ లిఫ్ట్ ఆగిపోయింది. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా అది పని చేయలేదు (Men stuck in the lift). చివరకు తమ పక్క ఫ్లాట్ వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దాదాపు అర్ధగంట తర్వాత అపార్ట్‌మెంట్ సిబ్బంది లిఫ్ట్ డోర్‌లు తెరిచారు. అయితే వారు ముందు బయటకు రాకుండా తమ చేతుల్లోనే చోలే భతురే (Chole Bhature) ప్లేట్‌లను భద్రంగా బయటకు ఇచ్చారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. వారు ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కినా అది పనిచేయలేదు. దీంతో వాళ్లు 30 నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. చివరకు ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి సహాయం కోరారు. చివరకు అపార్ట్‌మెంట్ సిబ్బంది లిఫ్ట్ డోర్‌లు తెరిచారు. లోపల ఆ ముగ్గురు చోలే-భతురే ప్లేట్‌లను పట్టుకుని కనిపించారు. పాడైపోయిన లిఫ్ట్ నుంచి బయటకు రాకుండా తమ చోలే-భతురూ ప్లేట్‌లను భద్రంగా బయటకు అందించారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చారు (Funny Video).

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``చోలే-భతురేకు ఏం జరగకూడదు``, ``లిఫ్ట్‌లో దానిని తినేయొచ్చు కదా``, ``ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. భతురేను రక్షించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 03:52 PM