Viral: అమితాబ్ బచ్చన్ అభిమాని.. నేపాల్‌లోనే అత్యంత ధనవంతుడు.. అతడి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2023-07-31T16:20:14+05:30 IST

అతని పేరు వినోద్ చౌదరి (Binod Chaudhary). నేపాల్‌ (Nepal`s Billionaire)కు చెందిన ఒకే ఒక్క బిలియనీర్. అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కు వీరాభిమాని అయిన వినోద్ వేల కోట్లకు అధిపతి. అతని కంపెనీ CG Corp Global కంపెనీలను కలిగి ఉంది. వినోద్ చౌదరి ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది.

Viral: అమితాబ్ బచ్చన్ అభిమాని.. నేపాల్‌లోనే అత్యంత ధనవంతుడు.. అతడి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవడం ఖాయం!

అతని పేరు వినోద్ చౌదరి (Binod Chaudhary). నేపాల్‌ (Nepal`s Billionaire)కు చెందిన ఒకే ఒక్క బిలియనీర్. అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కు వీరాభిమాని అయిన వినోద్ వేల కోట్లకు అధిపతి. అతని కంపెనీ CG Corp Global కంపెనీలను కలిగి ఉంది. వినోద్ చౌదరి ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. రాజస్థాన్‌ (Rajasthan)కు చెందిన మార్వాడీ కుటుంబానికి చెందిన వాడు. వినోద్ తాత రాజస్థాన్‌ నుంచి నేపాల్‌లోని ఖాట్మాండుకు వలస వెళ్లారు. వినోద్ తండ్రి ఎన్నో ఏళ్ల క్రితం నేపాల్‌లో తొలి డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఓపెన్ చేసిన ఘనుడు.

తండ్రిలా వ్యాపారం కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని వినోద్ అనుకున్నాడు. అయితే తండ్రి గుండెపోటుకు గురి కావడంతో వినోద్ తన ఆశలను చంపుకున్నాడు. అనివార్యంగా వ్యాపార రంగంలోకి దిగాడు. ఎన్నో రంగాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ వంటి అనేక రంగాలలో వినోద్ సంస్థ విస్తరించింది. నేపాల్‌లోని నబిల్ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను కూడా కలిగి ఉన్నాడు. అలాగే భారత్‌తో సహా పలు దేశాల్లో 140 ఫైవ్-స్టార్ హోటళ్లను నిర్మించాడు (Inspirational Story).

Viral: ఆఫీస్‌ బాత్రూమ్‌లో 10 నిమిషాలు ఉన్న ఉద్యోగిని.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో తెలిస్తే షాక్!

వినోద్ చౌదరి నికర ఆస్తుల విలువ 1.8 బిలియన్ డాలర్లు (రూ. 14,800 కోట్లు). బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు వినోద్ చౌదరి వీరాభిమాని. అమితాబ్ సినిమా వస్తే ఇప్పటికీ ఆయన చూడకుండా ఉండరు. భారతీయ పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా, దక్షిణాఫ్రికా నోబెల్ గ్రహీత నెల్సన్ మండేలాలు వినోద్‌కు స్ఫర్తి ప్రదాతలు. వినోద్ అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. నేపాల్ పార్లమెంటు సభ్యుడు కూడా కావడం విశేషం.

Updated Date - 2023-07-31T16:20:14+05:30 IST