Chiranjeevi 156 Trending: మారుతి ఫిక్స్ అయినట్లేనా?

ABN , First Publish Date - 2023-01-31T15:06:19+05:30 IST

యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya) సూపర్‌ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారాయన. తదుపరి మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ కొంతవరకూ పూర్తయింది

Chiranjeevi 156 Trending: మారుతి ఫిక్స్ అయినట్లేనా?

యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya) సూపర్‌ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారాయన. తదుపరి మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ కొంతవరకూ పూర్తయింది. త్వరలోనే తాజా షెడ్యూల్‌ మొదలుకానుంది. తదుపరి చిత్రం మారుతితో ఉంటుందనే వార్త మంగళవారం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ‘Chiru 156’ మారుతి (Maruthi)దర్శకత్వంలో ఉంటుందని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. మారుతి కూడా చిరంజీవితో ఓ సినిమా కమిట్‌ అయినట్లు గత ఇంటర్వ్లూలో తెలిపారు. అదే ఇప్పుడు చిరంజీవి 156 కానుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ నెట్టింట అయితే ఈ వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది.చిరు కోసం మారుతి ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో.. చూడాలి. (Chiru 156 in maruthi Diretcion)

కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శ్రుతీహాసన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రవితేజ, కేథరిన్‌, బాబీసింహా కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-01-31T15:06:41+05:30 IST