Share News

Marriage Card: వధూవరులు ఇద్దరూ పీహెచ్‌డీలు చేస్తే ఇలాగే ఉంటుందేమో.. పెళ్లి కార్డును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-11-28T14:50:23+05:30 IST

ప్రత్యేకంగా ఉండాలని అలా ప్లాన్ చేశారో లేక ఆటోమేటిక్ గా అలా జరిగిపోయిందో తెలీదు కానీ ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే..

Marriage Card: వధూవరులు ఇద్దరూ పీహెచ్‌డీలు చేస్తే ఇలాగే ఉంటుందేమో.. పెళ్లి కార్డును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ఒకప్పుడు పెళ్లిళ్లు చాలా ఘనంగా జరిగేవి. కాలక్రమంగా అవి హడావిడిగా రెండురోజుల్లో ముగించడం మొదలుపెట్టారు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆ ప్రకారంగా పెళ్లిళ్లు ఇప్పుడు మళ్లీ ఘనంగా జరగడం మొదలయ్యాయి. పెళ్లి కుదిరిందంటే చాలు.. షాపింగ్ నుండి ఫంక్షన్ హాల్, ఫుడ్ మెనూ, ఇన్విటేషన్ కార్డ్ వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ కాబోయే జంట ప్రత్యేకంగా ఉండాలని అలా ప్లాన్ చేశారో లేక ఆటోమేటిక్ గా అలా జరిగిపోయిందో తెలీదు. కానీ ఇద్దరు పిహెచ్డీలు చేసిన కాబోయే వధూవరులు తమ పెళ్లి కార్డును వింతగా రూపొందించారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్Bangladesh)కు చెందిన వధూవరులు తమ పెళ్లికార్డుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. బంగ్లాదేశ్ కు చెందిన తబస్సుమ్ స్నేహ, మహ్జీబ్ హుస్సేన్ ఇమామ్ ఇద్దరూ పిహెచ్డీ లు చేశారు. వెడ్డింగ్ కార్డ్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా వారిద్దరిదీ ప్రేమ వివాహాం అని అర్థమవుతోంది. పెళ్లికార్డులో మొదట వధూవరుల పేర్లున్నాయి. అనంతరం పెళ్లి గురించి వివరణ పొందుపరిచారు. ఆ తరువాత కీ వర్డ్స్ పెట్టి వధూవరుల పేర్లు, పెళ్లి అంటూ పేర్లు పొందుపరిచారు. దీని తరువాత ఇంట్రడక్షన్ అని పెట్టారు. అక్కడ వారిద్దరూ మొదట కలసిన ప్రదేశం గురించి వివరణ ఉంది. దానికి సరిగ్గా సరిపోయే ఖురాన్ లోని శ్లోకాన్ని అక్కడ పొందుపరిచారు. ఆ తరువాత లొకేషన్ అనే సబ్ టైటిల్ పెట్టి పెళ్లి జరిగే ప్రదేశం గురించి పొందుపరిచారు. పెళ్లి ఢాకాలో జరుగుతున్నట్టు అందులో ఉంది. దీని తరువాత మెథడాలజీ అనే సబ్ టైటిల్ పెట్టారు. ఇక్కడ పెళ్లి జరిగే క్రమం, సమయం గురించి ఉంది. వాటికి తగిన ఖురాన్ శ్లోకాలను కూడా పొందుపరిచారు. ఈ శ్లోకాలు ఖురాన్ లో ఎక్కడున్నాయనే విషయాన్ని తెలపడానికి సూరాలను కూడా పొందుపరిచారు. చివరగా కన్ క్లూజన్, రిఫరెన్స్ తో వెడ్డింగ్ కార్డ్ ముగిసింది. ఈ పెళ్లికార్డు ఓ మినీ రీసెర్చ్ కాగితంలా అనిపిస్తోంది. దీన్ని పొందుపరిచిన తీరు కూడా అలాగే ఉంది.

ఇది కూడా చదవండి: ఈ 10 పక్షులను కొనాలంటే ఆస్తులమ్మినా చాలదు.. ఒక్కోదాని ధర ఎంతంటే..!


ఈ పెళ్లికార్డును @rayyanparhlo అనే ట్విట్టర్ ఎక్స్ యూజర్ షేర్ చేశారు. 'నేనిప్పటికీ ఇది పెళ్ళికార్డని నమ్మలేకపోతున్నాను' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఓహ్ నేను దీన్ని రీసెర్చ్ పేపర్ అనే అనుకున్నాను. మీ క్యాప్షన్ వల్ల నిజం తెలిసింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇద్దరు పీహెచ్డీ చేసిన వారు పెళ్లి చేసుకుంటే ఇలాగుంటుందనమాట' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'వెడ్డింగ్ కార్డ్ లో ఉన్న మ్యాప్ పనికిరాదు. దాని బదులు QRకోడ్ పెట్టి ఉంటే బాగుండేది' అని ఇంకొకరు పంచ్ వేశారు.

ఇదికూడా చదవండి: Coconut Oil: కొబ్బరి నూనె అసలు మంచిదేనా..? చాలా మందికి తెలియని నిజాలివి..!


Updated Date - 2023-11-28T14:50:26+05:30 IST