Viral Video: ఎంత పనిచేశావయ్యా.. బోటులో వెళ్తూ చేపల్ని పట్టుకుందామని చేతుల్ని నీళ్లలోకి పెట్టాడు.. మరుక్షణంలోనే..!
ABN , First Publish Date - 2023-06-28T17:39:19+05:30 IST
పాపం.. ఆ వ్యక్తి పడవపై కూర్చుని నీటిలోకి చేతులు పెట్టాడు.. చేపల్ని పట్టుకుందామని ప్రయత్నించాడు.. అయితే అంతలో హఠాత్తుగా ఓ షార్క్ నీటి లోపలి నుంచి బయటకు వచ్చి అతడిపై దాడి చేసింది.. దాంతో అతడు బోటు నుంచి కింద పడ్డాడు..
పాపం.. ఆ వ్యక్తి పడవ (Boat)పై కూర్చుని నీటిలోకి చేతులు పెట్టాడు.. చేపల్ని (Fish) పట్టుకుందామని ప్రయత్నించాడు.. అయితే అంతలో హఠాత్తుగా ఓ షార్క్ (Shark) నీటి లోపలి నుంచి బయటకు వచ్చి అతడిపై దాడి చేసింది.. దాంతో అతడు బోటు నుంచి కింద పడ్డాడు.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లోరిడా (Florida)లోని ఎవర్‌గ్లేడ్స్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనను ఆ వ్యక్తి స్నేహితుడు తన కెమెరాలో బంధించాడు.
Florida అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో ఒక వ్యక్తి బోటుపై ఉన్నాడు. బోటులో నుంచి వంగి నీటిలో ఉన్న చేపలను ఒట్టి చేతులతో పట్టుకోవాలనుకున్నాడు. నీటిని అటూ ఇటూ కదలించాడు. ఇంతలో ఓ సొరచేప నీటి అడుగు నుంచి బయటకు వచ్చి అతడిని లాగేసింది. దీంతో అతడు బోటు నుంచి నీటి లోపల పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతడు షార్క్ నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. పార్క్ రెస్క్యూ టీమ్ వెంటనే అతడిని హెలీకాఫ్టర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు (Shark Videos).
Viral News: ఈ సింపుల్ ప్రశ్నకు పది సెకన్లలో సమాధానం కనుక చెప్తే.. మీరు నిజంగా తెలివైన వాళ్లే..!
ఈ ఘటన జరుగుతున్నప్పుడు బాధితుడి స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``నీటిలో గడిపిన అత్యంత భయంకరమైన రోజు ఇది`` అని ఆ స్నేహితుడు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.