Viral Video: బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ కోసం ఆర్డర్.. తీరా అందులో వచ్చిన ఐటెంతో కస్టమర్‌కు షాకింగ్ అనుభవం!

ABN , First Publish Date - 2023-02-11T13:29:08+05:30 IST

ప్రస్తుత బిజీ జీవితంలో మార్కెట్‌కు వెళ్లి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే తీరిక జనాలకు లేకుండా పోయింది.

Viral Video: బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ కోసం ఆర్డర్.. తీరా అందులో వచ్చిన ఐటెంతో కస్టమర్‌కు షాకింగ్ అనుభవం!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత బిజీ జీవితంలో మార్కెట్‌కు వెళ్లి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే తీరిక జనాలకు లేకుండా పోయింది. దాంతో చాలావరకు ఆన్‌లైన్‌‌లోనే షాపింగ్ కానిచ్చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమే ఆలస్యం ఇలా చిటికెలో కావాల్సిన వస్తువులు మనముందు ప్రత్యక్షమవుతున్నాయి. తినే ఫుడ్ నుంచి ఇంట్లో గ్రొసరీ వరకు అన్నింటినీ ఆన్‌లైన్ యాప్స్ డెలవరీ చేస్తున్నాయి. ఒకదానితో మరోకటి పోటీ పడి మరీ డోర్ డెలవరీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కస్టమర్లకు ఎదురవుతున్న కొన్ని వింత సంఘటనుల అప్పడప్పుడు బయటకు వస్తున్నాయి. కొన్ని తాము ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరే వస్తువు రావడం, మరికొన్ని సార్లు విలువైన వస్తువులకు బదులుగా డమ్మీవి రావడం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఇక ఫుడ్ ఐటెమ్స్ విషయంలో కూడా చాలావరకు ఇలాంటివే చోటు చేసుకుంటున్నాయి. ఇదే కోవలో తాజాగా నితిన్ ఆరోరా అనే కస్టమర్‌కు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్ యాప్ బ్లింకిట్ (Blinkit) ద్వారా బ్రేడ్ ప్యాకెట్ ఆర్డర్ చేసిన అతడికి అందులో వచ్చిన ఐటెం చూసి మతిపోయింది. వెంటనే ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

అసలేం జరిగిందంటే.. నితిన్ ఆరోరా ఓ బ్రేడ్ ప్యాకెట్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాడు. పది నిమిషాల్లో డెలివరీ అని చెప్పిన బ్లింకిట్.. దాదాపు రెండు నుంచి మూడు గంటల తర్వాత అతడి చేతికి ఆ ఆర్డర్‌ అందింది. అప్పటికే బాగా ఆకలితో ఉన్న ఆరోరా ఎంతో ఆత్రుతగా ఆ ప్యాకెట్‌ను చేతికి అందుకున్నాడు. తీరా ప్యాకెట్‌ను చేతిలోకి తీసుకుని చూస్తే అందులో ప్రాణాలతో ఉన్న ఎలుక కనిపించింది. ఒక్క క్షణంపాటు అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ ప్యాకెట్‌ను వీడియో తీసి ట్విటర్‌లో (Twitter) పెట్టాడు.

ఇది కూడా చదవండి: దుబాయిలో ఓ భారతీయ ఫ్యామిలీ కొన్న.. ఈ విలాసవంతమైన విల్లా ఖరీదు తెలిస్తే..

"బ్లింకిట్‌తో నాకు ఎదురైన చాలా అసహ్యకరమైన అనుభవం ఇది. ఈ నెల 1వ తేదీన ఆర్డర్ చేసిన బ్రేడ్ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక వచ్చింది. ఈ సంఘటనతో మనం తప్పకుండా మెల్కొవాలి. పది నిమిషాల్లో డెలివరీ అని చెప్పిన బ్లింకిట్ కొన్ని గంటల పాటు నిరీక్షించేలా చేసింది. చివరకు ఇలా పనికిమాలిన వస్తువును డెలివరీ చేసింది" అంటూ రాసుకొచ్చాడు. కాగా, ఆరోరా పోస్టుపై స్పందించిన బ్లింకిట్.. "హాయ్ నితిన్, ఇది మీకు కావాల్సిన అనుభవం కాదు. దయచేసి మీ రిజిస్టర్ కాంటాక్ట్ నంబర్ లేదా ఆర్డర్ ఐడీని షేర్ చేస్తే మేము పరిశీలిస్తామని" ట్వీట్ చేసింది.


Updated Date - 2023-02-11T13:59:49+05:30 IST