Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...

ABN , First Publish Date - 2023-04-04T07:55:26+05:30 IST

ఓ సాధారణ డ్రైవర్ గేమింగ్ యాప్‌లో కేవలం 49 రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఉదంతం...

Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...
Driver Shahabuddin Mansuri

భోపాల్(మధ్యప్రదేశ్): ఓ సాధారణ డ్రైవర్ గేమింగ్ యాప్‌లో కేవలం 49 రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది.(Madhya Pradesh)మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన డ్రైవర్ షహబుద్దీన్ మన్సూరి(Driver Shahabuddin Mansuri) ఆదివారం ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో(Online Gaming App) రూ.49 పెట్టుబడి పెట్టి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. గేమింగ్ యాప్‌లో రూ. 49 కేటగిరీలో వర్చువల్ క్రికెట్ జట్టును సృష్టించడం ద్వారా అతను మొదటి స్థానాన్ని పొంది ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.

తాను గత రెండేళ్లుగా ఇలాంటి ఆన్‌లైన్ క్రికెట్ గేమ్‌లలో జట్లను సృష్టించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు షహబుద్దీన్ మన్సూరి చెప్పారు. షహబుద్దీన్ ఆదివారం కోల్ కతా, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్ లో క్రికెట్ టీమ్ ను ఏర్పాటు చేశాడు.

ప్రస్తుతం షహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుంచి గెల్చుకున్న మొత్తం రూ. 1.5 కోట్లలో రూ.20 లక్షలు విత్‌డ్రా చేశాడు. మొత్తం రూ.6 లక్షలు ఆదాయపు పన్ను మినహాయించగా షహబుద్దీన్ బ్యాంకు ఖాతాలో రూ.14 లక్షలు జమ అయ్యాయి.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సెంద్వాలో అద్దె ఇంట్లో ఉంటున్న షహబుద్దీన్ గెలిచిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. మిగిలిన మొత్తంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Updated Date - 2023-04-04T08:43:50+05:30 IST