నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది.. ఒక్క అమ్మాయి మొత్తం మార్చేసింది.. అంటూ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే షాక్

ABN , First Publish Date - 2023-03-19T19:50:31+05:30 IST

ఆ కుర్రాడి వయసు 26 సంవత్సరాలు.. డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. చాలా సంతోషంగా సాగిపోతున్న జీవితం.. హఠాత్తుగా ఓ అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించి మొత్తం నాశనం చేసింది..

నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది.. ఒక్క అమ్మాయి మొత్తం మార్చేసింది.. అంటూ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే షాక్

ఆ కుర్రాడి వయసు 26 సంవత్సరాలు.. డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. చాలా సంతోషంగా సాగిపోతున్న జీవితం.. హఠాత్తుగా ఓ అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించి మొత్తం నాశనం చేసింది.. ప్రేమ (Love) పేరుతో ట్రాప్ చేసి లక్షలు ఖర్చు పెట్టించింది.. అతడిని పూర్తిగా అప్పుల పాలు చేసి వెళ్లిపోయింది.. తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన యువకుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. చనిపోయే ముందు ఆ యువతి పేరు చెప్పి, ఆమెను శిక్షించాలని వేడుకున్నాడు (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్పూర్‌కు చెందిన ఆశిష్ అహిర్వార్ (26) ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి అటవీ ప్రాంతంలో అతడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఆ యువకుడు సూసైడ్ నోట్ రాసి, వీడియో కూడా రూపొందించాడు. తన ఆత్మహత్యకు ఓ యువతి కారణమని వీడియోలోనూ, సూసైడ్ నోట్‌లోనూ రాశాడు. ఆ యువతికి కచ్చితంగా శిక్ష పడాలని పేర్కొన్నాడు. చనిపోయే ముందు ఆశిష్ ఆ యువతితో మాట్లాడినట్టు కాల్ రికార్డ్స్‌ను బట్టి బయటపడింది.

Viral Video: వామ్మో.. ఇదేం జంతువు.. ఒక్క గుక్కలో లేడిని ఎలా మింగేసిందో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

``ఒక అమ్మాయి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. అయితే ఒక అమ్మాయి వల్ల అబ్బాయి ఎంత మానసిక క్షోభకు గురవుతాడో ఎవరికీ తెలియదు. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉండేది. హఠాత్తుగా ఒక అమ్మాయి వచ్చి సర్వ నాశనం చేసింది. నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి లక్షలు కాజేసింది. నా మరణానికి ఆ యువతి, ఆమె సోదరుడే కారణం. వారికి శిక్ష పడి తీరాల``ని సూసైడ్ నోట్‌లో ఆశిష్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

వైద్యం పేరుతో అమాయక యువతికి వల.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ శునకానందం.. చివరకు ఎంత పని చేశాడంటే..

Updated Date - 2023-03-19T19:52:00+05:30 IST