Share News

Kidney Damage Signs: మూత్రంలో ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కిడ్నీలు పాడయిపోతున్నట్టే లెక్క..!

ABN , First Publish Date - 2023-11-22T14:46:33+05:30 IST

మూత్రానికి వెళ్లినప్పుడు ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నట్టే..

Kidney Damage Signs: మూత్రంలో ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కిడ్నీలు పాడయిపోతున్నట్టే లెక్క..!

మూత్రపిండాలు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేసి శుభ్రపరుస్తుంది. మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యమైన విధులను కూడా నిర్వహిస్తుంది. మానవ మనుగడకు మూత్రపిండాల పనితీరు సమర్థవంతంగా ఉండటం తప్పనిసరి. కానీ జీవనశైలిలో మార్పుల కారణంగా, కిడ్నీలు దెబ్బతింటాయి. దీన్ని సకాలంలో గుర్చించకపోతే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. మూత్రానికి వెళ్లినప్పుడు కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా కిడ్నీలు పాడవుతున్న విషయాన్ని గుర్తించవచ్చు.

మూత్రం రంగు(urine color)లో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తే మూత్రపిండాల పనితీరు దెబ్బతినిందని అర్థం. సాధారంగా మూత్రపిండాలు దెబ్బ తిన్నప్పుడు మూత్రం ముదురు రంగులో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్లకు సంకేతం.

ఇది కూడా చదవండి: Early Dinner: రాత్రిపూట తొందరగా భోజనం చేయడం మంచిదేనా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!



మూత్రానికి వెళ్లినప్పుడు మూత్రం దుర్వాసన(urine smell) వస్తుంటే కిడ్నీలో ఏదో లోపం ఉందని అర్థం. ఇది మూత్రపిండాల డ్యామేజ్, ఇన్ఫెక్షన్ కు కారణం కావచ్చు. ఈ వాసనలో వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉండచ్చు.

పదేపదే మూత్రవిసర్జన(urination feeling) చేయాలని అనిపించడం కూడా మూత్రపిండ సమస్యను సూచిస్తంది. మూత్రపిండాలు విఫలమైతే శరీరం మూత్రాన్ని నియంత్రించుకోలేదు. ఇది మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేదనడానికి, శరీరంలో మలినాలు, వ్యర్థపదార్థాలు పేరుకుపోయాయనడానికి ఇది సంకేతం.

మూత్రానికి వెళ్ళినప్పుడు నురుగు కనిపిస్తే(foam while urination) అది మూత్రపిండాలు వైఫల్యం చెందాయనడానికి సంకేతం. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్ ఉండదు. కానీ ఈ నురుగు ద్వారా శరీరంలోని ముఖ్యమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. ఇది జరిగితే మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నాయని అర్థం.

ఇది కూడా చదవండి: Health Facts: కూర్చునే కుర్చీ వల్ల కూడా రోగాలే.. అసలు ఓ మంచి కుర్చీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే..!


Updated Date - 2023-11-22T14:46:35+05:30 IST