UPSC Exams : సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కేరళ దంపతులకు డబుల్ ధమాకా!

ABN , First Publish Date - 2023-05-25T19:08:31+05:30 IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఫైనల్ పరీక్షలు, 2022లో కేరళ దంపతులు మాళవిక జీ నాయర్ (28), డాక్టర్ ఎం నందగోపన్ విజయం సాధించారు.

UPSC Exams : సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కేరళ దంపతులకు డబుల్ ధమాకా!
Malavika, M Nandagopan

తిరువనంతపురం : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఫైనల్ పరీక్షలు, 2022లో కేరళ దంపతులు మాళవిక జీ నాయర్ (28), డాక్టర్ ఎం నందగోపన్ విజయం సాధించారు. మాళవికకు 172వ ర్యాంకు, ఆమె భర్త నందగోపన్‌కు 233వ ర్యాంకు లభించింది. ఈ ఫలితాలను మే 23న విడుదల చేశారు. మొత్తం మీద 933 మంది ఉత్తీర్ణులయ్యారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, మాళవిక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (బిట్స్ గోవా)లో చదివారు. ఆమె మంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. 2020లో ఐఆర్ఎస్‌ పరీక్షల్లో విజేతగా నిలవడంతో ఆమెకు ఈ ఉద్యోగం లభించింది. ఆమె ఐదోసారి ప్రయత్నించి సివిల్ సర్వీసెస్ ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించారు. ఆమె భర్త నందగోపన్ చిట్టచివరి, ఆరో ప్రయత్నంలో విజేతగా నిలిచారు.

మాళవిక (Malavika G Nair) తండ్రి కేజీ అజిత్ కుమార్ కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డీజీఎంగా పని చేసి, పదవీ విరమణ చేశారు. ఆమె తల్లి డాక్టర్ గీతా లక్ష్మి గైనకాలజిస్ట్. యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షల కోసం ఆమె సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు.

నందగోపన్ (Dr M Nandagopan) పఠనంతిట్ట జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో పని చేస్తున్నారు. యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షల కోసం ఆయన మలయాళం సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. ఆయన తండ్రి ఐఓబీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్. ఆయన తల్లి డాక్టర్ ఎస్ ప్రతిభ కొజెన్‌‌చెర్రి జిల్లా ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్‌గా చేస్తున్నారు.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ పరీక్షలు, 2022లో మొదటి నాలుగు స్థానాల్లో ఇషిత కిషోర్, గరిమ లోహియా, ఉమా హారతి, స్మృతి నిలిచారు. వీరంతా మహిళలే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్

Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ

Updated Date - 2023-05-25T19:08:31+05:30 IST