K Viswanath: సీతారామశాస్త్రి ఇంటిపేరుగా మారిపోయిన విశ్వనాథుడి చిత్రమిది.. కథ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-03T12:23:17+05:30 IST

దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు కళాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచి తెలుగు సినిమాకు ఒక స్థాయి కల్పించారు దర్శక దిగ్గజం కే.విశ్వనాథ్ (K Viswanath). 1957లో సౌండ్ ఇంజనీర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శ్రుతిలయలు వంటి సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు..

K Viswanath: సీతారామశాస్త్రి ఇంటిపేరుగా మారిపోయిన విశ్వనాథుడి చిత్రమిది.. కథ ఏంటంటే..

దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు కళాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచి తెలుగు సినిమాకు ఒక స్థాయి కల్పించారు దర్శక దిగ్గజం కే.విశ్వనాథ్ (K Viswanath). 1957లో సౌండ్ ఇంజనీర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శ్రుతిలయలు వంటి సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు...

ఈ క్రమంలో తన సినిమాల్లో అవకాశంతో ఉన్నత స్థాయికి ఎదిగిన కళాకారులు ఎందరో ఉన్నారు. అందులో ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామరామశాస్త్రి (Sirivennela Sitaramasastri) కూడా ఒకరు. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాతో (Sirivennela Movie) సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రికి ఈ సినిమానే ఇంటి పేరుగా ముద్రపడిపోయింది. సుహాసిని, సర్వదామన్ బెనర్జీ, మూన్ సెన్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కేవీ మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. వీటన్నింటినీ సీతారామ శాస్త్రే రచించారు. విధాత తలపున ప్రభవించినదీ పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా, ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశంసలను దక్కించుకున్న ‘సిరివెన్నెల’ సినిమా విశేషాలను ఒకసారి గుర్తుచేసుకుందాం..

2.jpg

1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ సినిమాను శాస్త్రీయ సంగీత నేపథ్యంతో కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రీకరించారు. ఒక అంధ వేణు విద్వాంసుడు, మూగ చిత్రకారిణి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పర్యాటక ప్రదేశంలోని ఒక గ్రామంలో హరిప్రసాద్ అనే ఒక అంధ వేణుగాన కళాకారుడు నివసిస్తుంటాడు.

23.jpg

శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకపోయినా టూరిస్టుల కోసం పాటలు వాయించగా వచ్చే డబ్బుతో జీవితం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో జ్యోతిర్మయి అనే గైడ్ అతని వేణుగాన నైపుణ్యానికి ముగ్ధురాలైపోతుంది. ప్రతిభను సానబెట్టడానికి సహకారం అందిస్తుంది. గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవడం తోడ్పాటునిస్తుంది.

24.jpg

ఈ క్రమంలో హరిప్రసాద్ ఆమెకు తెలియకుండానే మనసులో ఆమెను ఆరాధిస్తుంటాడు. అయితే మాటలు రాని సుభాషిణి అనే చిత్రకారిణి హరిప్రసాద్‌ని ఆరాధించడం కథలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. పెళ్లి విషయమై సంప్రదించగా తనకు జ్యోతిర్మయి మీదున్న అభిమానాన్ని హరిప్రసాద్ బయటపెడతాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతిర్మయి తాను అతనికి సరిపోనని భావిస్తుంది.

Untitled-9.jpg

చివరికి ఓ వైద్యుడితో నిశ్చితార్థమవ్వడంతో అతడినే పెళ్ళి చేసుకుంటుంది. అయితే పెళ్ళి రోజే తన కళ్ళను అంధుడైన హరిప్రసాద్‌కి దానమివ్వమని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. అది విచిత్రంగా చూస్తున్న సుభాషిణికి తన దేవత తనకు దూరమైన సంగతి తన దగ్గర ఎవ్వరూ దాచలేరని చెబుతాడు. ఇద్దరూ మౌనంగా జ్యోతిర్మయి సమాధికేసి చూస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

Updated Date - 2023-02-03T12:27:42+05:30 IST