#NTR30: ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ ఎలా ఉందో చూసారా...

ABN , First Publish Date - 2023-03-06T11:16:27+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా లో జాన్వీ కపూర్ ఎలా వుండబోతోంది అని ఆమె లుక్ ఒకటి ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు

#NTR30: ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ ఎలా ఉందో చూసారా...

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆస్కార్ అవార్డు (Oscars2023) ఫంక్షన్ కి బయలుదేరాడు. ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని విమానాశ్రయం లో కనిపించి, ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి వెళుతున్నట్టుగా చెప్పాడు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా ఇంకా అధికారికంగా లాంచ్ అవలేదు, కానీ ఈరోజు 11.07 నిముషాలకి జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోస్టర్ మాత్రం విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే ఉంటుందని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ నుండి తిరిగి వచ్చాక, ఈ సినిమా అధికారికంగా మొదలవడం, ఆ తరువాత వెంటనే షూటింగ్ కూడా మొదలెట్టడం జరుగుతుందని తెలుస్తోంది. (Oscar Award)

jahnvikapoor.jpg

అయితే ఈలోపు జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) పుట్టిన రోజు సందర్భంగా ఆమెని ఈ #NTR30 సినిమాలో అధికారికంగా వుంది అని ఈ పోస్టర్ ద్వారా చెప్పేసారు. దీనితో ఆమె ఈ సినిమాలో ఉందా లేదా అనే వార్తలకి ఇంకా ఒక ఫుల్ స్టాప్ పెట్టేసారు. జాన్వీ కపూర్ పోస్టర్ లో ఆమె అచ్చమయిన తెలుగు అమ్మాయిల కనిపించింది. అయితే ఈ సినిమా సముద్రం నేపధ్యం లో ఉంటోంది కాబట్టి, జాన్వీ కపూర్ పోస్టర్ వెనక సముద్రాన్ని చూపించారు. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా ఆమె ఒక్కర్తెనా, లేక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అనే విషయం కూడా ఇంకా చెప్పలేదు. ఏమైనా జాన్వీ కపూర్ అందంగా వుంది, ఎన్టీఆర్ పక్కన బాగుంటుంది అని అభిమానులు సాంఘీక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2023-03-06T11:21:10+05:30 IST