Rishab Shetty: మోహన్ లాల్ సినిమాలో ‘కాంతార’ హీరో..?

ABN , First Publish Date - 2023-01-26T17:02:13+05:30 IST

మాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. తన కెరీర్‌లోనే మొదటిసారిగా లిజో జోస్ పెల్లిస్సేరి (Lijo Jose Pellissery) దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌గా ‘మలైకోట్టై వాలిబన్’ (Malaikottai Valiban) అని వ్యవహరిస్తున్నారు.

Rishab Shetty: మోహన్ లాల్ సినిమాలో ‘కాంతార’ హీరో..?

మాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. తన కెరీర్‌లోనే మొదటిసారిగా లిజో జోస్ పెల్లిస్సేరి (Lijo Jose Pellissery) దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌గా ‘మలైకోట్టై వాలిబన్’ (Malaikottai Valiban) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతుంది. లాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ మాలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది.

‘మలైకోట్టై వాలిబన్’ లో ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అతిథి పాత్రను పోషించాలని మేకర్స్ రిషబ్‌ను సంప్రదించారట. మోహన్ లాల్‌తో నటించడానికి రిషబ్ శెట్టి కూడా ఆసక్తి చూపించారట. మూవీ చేసేందుకు అంగీకరించాడని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఒకవేళ్ రిషబ్ కనుక ఈ చిత్రంలో నటిస్తే మాలీవుడ్‌లో ఆయనకు ఇదే మొదటి ప్రాజెక్టు అవుతుంది. ‘మలైకోట్టై వాలిబన్’ లో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్, జీవా, కీర్తి చక్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరాఠీ నటి సొనాలి కులకర్ణి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతోనే మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Updated Date - 2023-01-26T17:03:56+05:30 IST