Women's Day 2023: 18 ఏళ్ల క్రితం భర్త మృతి.. కొడుకు ఐపీఎస్... అయినా పొలం పనులకు వెళ్తున్న తల్లి.. అదేమని అడిగితే..

ABN , First Publish Date - 2023-03-08T14:26:59+05:30 IST

భర్త చనిపోవడంతో ఆ మహిళ ఒంటరిదైంది.. ఇద్దరు కొడుకులతో కలిసి రోడ్డు మీద పడింది.. అయినా అధైర్యపడకుండా 18 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేసి కొడుకులను పై చదువులు చదివించింది.. ఆ తల్లి కష్టం వృథా కాలేదు..

Women's Day 2023: 18 ఏళ్ల క్రితం భర్త మృతి.. కొడుకు ఐపీఎస్... అయినా పొలం పనులకు వెళ్తున్న తల్లి.. అదేమని అడిగితే..

భర్త చనిపోవడంతో ఆ మహిళ ఒంటరిదైంది.. ఇద్దరు కొడుకులతో కలిసి రోడ్డు మీద పడింది.. అయినా అధైర్యపడకుండా కూలి పనులు చేసుకుంటూ కొడుకులను చదివించింది.. ఏకంగా 18 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేసి కొడుకులను పై చదువులు చదివించింది.. ఆ తల్లి కష్టం వృథా కాలేదు.. పెద్ద కొడుకు బాగా చదువుకుని ఏకంగా ఐపీఎస్ అధికారి అయ్యాడు.. అయినా ఆ తల్లి కూలి పనులకు వెళ్లడం మాత్రం మానలేదు.. రాజస్థాన్‌లోని (Rajasthan) దౌసాకు చెందిన సజ్నో దేవి (Sajno Devi) ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా (Inspirational Story) నిలుస్తోంది.

దౌసాకు చెందిన సజ్నో భర్త 2005లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అత్తమామలు కూడా ఆమెను వదిలేశారు. ఎవరూ సహాయం చేయలేదు. తన ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడం కూడా కష్టంగా మారింది. కానీ సజ్నో ధైర్యం కోల్పోలేదు. నిరక్ష్యరాస్యురాలైన సజ్నోకు చదువు ప్రాముఖ్యం తెలుసు. తమ రాత మారాలంటే పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. పిల్లలు అరవింద్, అల్పేష్‌లకు చదువు ప్రాధాన్యం వివరించి చదుకోవాలని ప్రోత్సహించింది. అరవింద్‌ను సైనిక్ స్కూల్లో చేర్పించింది. పగలు, రాత్రి కష్టపడి పని చేసింది. పెద్ద కొడుకు బాగా చదువుతుండడంతో పైసా పైసా కూడబెట్టి అతడి ఫీజులు కట్టింది.

Strange Laws in China: చైనాలో అయిదు వింత చట్టాలు.. స్త్రీలు యాడ్స్‌లో నటించడాన్ని బ్యాన్ చేయడం మాత్రమే కాదండోయ్.. ఈ రూల్స్ కూడా..

అరవింద్ పై చదువులకు వచ్చే సరికి సజ్నో సంపాదన సరిపోలేదు. దీంతో చిన్న కొడుకు అల్పేష్ ఆమెకు సహాయంగా నిలిచాడు. చదువు ఆపేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వారిద్దరి కష్టంతో చదువుకున్న అరవింద్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కు సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం శిక్షణ దశలో ఉన్నాడు. అరవింద్ ఐపీఎస్ అధికారి (IPS Officer for Poor Family) అయినా సజ్నో ఇంకా పొలం పనులకు వెళుతూనే ఉంది. అరవింద్ జీవితంలో స్థిరపడినా, ఇంకా అల్పేష్ బాధ్యత తనపై ఉందని, అతడు కూడా మంచి ఉద్యోగం సాధించే వరకు పని చేస్తూనే ఉంటానని సజ్నో తెలిపింది. కాగా, తన తల్లి కన్న ప్రతి కలను, ఆశను నెరవేరుస్తానని, తన తమ్ముడిని ఐయేఎస్‌కు సిద్ధం చేస్తానని అరవింద్ నమ్మకంగా చెబుతున్నాడు.

Updated Date - 2023-03-08T14:49:55+05:30 IST