RGV: శెభాష్ ఆర్జీవీ.. నీలో ఈ కోణానికి సెల్యూట్!

ABN , First Publish Date - 2023-03-01T12:36:40+05:30 IST

నిత్యం వివాదాస్పద స్టేట్ మెంట్లతో సంచలన వ్యాఖ్యలు చేసే ఆర్జీవీ..నెటిజన్ల నుంచి విమర్శలే కాదు.. అప్పుడప్పుడు ప్రశంసలు అందుకుంటుంటారు..తాజాగా దర్శకుడు(Director), చిత్రనిర్మాత (Producer) రామ్ గోపాల్ వర్మ(RGV) లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోయేలా ఓ మంచి పని చేశారు.

RGV: శెభాష్ ఆర్జీవీ.. నీలో ఈ కోణానికి సెల్యూట్!

హైదరాబాద్: నిత్యం వివాదాస్పద స్టేట్‌మెంట్లతో సంచలన వ్యాఖ్యలు చేసే ఆర్జీవీ (Ram Gopal Verma) ..నెటిజన్ల నుంచి విమర్శలే కాదు.. అప్పుడప్పుడు ప్రశంసలు అందుకుంటుంటారు..తాజాగా ఈ దర్శకుడు(Director), చిత్రనిర్మాత (Producer) రామ్ గోపాల్ వర్మ(RGV) లో కొత్త యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోయేలా ఓ మంచి పని చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లో వీధికుక్కల దాడి (Street Dogs Attack)లో మరణించిన ప్రదీప్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇటీవల ప్రదీప్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించిన ఆర్జీవీ(RGV) పలువురి హృదయాలను గెలుచుకున్నారు.

తాజాగా మరో అడుగు ముందుకేసీ ప్రదీప్ కుటుంబానికి ఫండ్ రైజింగ్ (Fund Raising) క్యాంపెయిన్ మొదలుపెట్టారు.‘‘తోటి పౌరులమైన మనం కనీసం ప్రదీప్ కుటుంబానికి సాయంగా మా వంతు కృషి చేయాలి’’ అని ఆయన చేసిన ట్వీట్(tweet) ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రదీప్ తల్లిదండ్రులకు(Parents) చెందిన జాయింట్ అకౌంట్‌కు తమవంతుగా చేయగలిగిన డబ్బును పంపమని హృదయం ఉన్న వారిని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ (RGV Tweet)పై స్పందించిన నెటిజన్లు.. ఆర్జీవీ చేసిన ఒక మంచిపని ప్రదీప్ కుటుంబం కోసం ఫండ్ రైజ్ అంటూ సెటైర్లతో కూడిన హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మనుషులపై ముఖ్యంగా చిన్నారులపై వీధికుక్కల దాడులు పెరుగుతుండడం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందడంతోపాటు ఇటీవల జరిగిన సంఘటనలు సమస్య తీవ్రతను ఎత్తిచూపుతున్నాయి. మల్లాపూర్‌లోని గ్రీన్ హిల్స్ కాలనీలోనూ ఇదే విధమైన సంఘటన జరిగింది. అక్కడ ఒక చిన్న పిల్లవాడిని రెండు వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ అతనికి స్వల్ప గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో బోరబండలో ఎనిమిది, ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. ఇకపై దాడులు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల బెడదను అరికట్టాలని ఆర్జీవీ కోరుతున్నారు.

వీధి కుక్కల దాడిలో చనిపోయిన ప్రదీప్ కటుంబం కోసం ఆర్జీవీ మరో మంచిపని కూడా ప్రారంభించారు. ప్రదీప్ కోసం న్యాయ పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘వారిది పేద కుటుంబం కావడం వల్లే ఎవరూ సపోర్టు చేయడం లేదని’’ మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు ఆర్జీవీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మేయర్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ కూడా చేశారు. అంతేకాదు, ప్రదీ కుటుంబం తరపున న్యాయపోరానికి దిగారు. అంతర్జాతీయ లాయర్ ను కేసు టేకప్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. అతడి కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడుతానని తెలిపారు.

ఇంటర్నేషనల్ లాయర్‌తో న్యాయపోరాటం

ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయడం కోసం అంతర్జాతీయ న్యాయవాదిని రంగంలోకి దించారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘‘ఈ విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో థ్రిల్‌గా ఫీలవుతున్నాను. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడటం కోసం మిస్టర్‌ శ్రీనివాస్‌ కావేటి(జ్యూరీస్‌ డాక్టరేట్‌, ఎల్‌ఎల్‌ఎం) అంతర్జాతీయ లాయర్‌ ఈ కేసును టేకప్‌ చేశారు’’ అని చెప్పారు. బాధిత కుటుంబంతో పాటు సదరు లాయర్‌ ఉన్న ఫోటోని ఈ మేరకు వర్మ షేర్‌ చేశారు.

తాజాగా ప్రదీప్ కుటుంబ పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. “ప్రదీప్ కుటుంబం చేసిన నేరం పేదరికం. అందుకే వారికి పెద్దపెద్ద సంస్థలు మద్దతు ఇవ్వడం లేదు. ఈ ఘటనతో ఓట్లు రాలవనే ఎవరూ అండగా నిలవడం లేదు” అంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆర్జీవీ.

ఇదే విషయంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీని ఆర్టీవీ వదల్లేదు. విజయలక్ష్మీ నివాసంలో అంబర్‌పేట సంఘటనలో బాలుడిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేల కుక్కలని వదిలేయాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు. మేయర్‌ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమగా చూస్తారో? ఏయే కుక్కలకి ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. అటు బాధిత బాలుడి తరఫున ఆర్జీవీ న్యాయపోరాటం చేయడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఏదీ ఏమైనా ఈ మంచి పనితో వివాదాలే కాదు.. నాలో హ్యూమన్ బీయింగ్ కూడా ఉందని నిరూపించుకున్నారు వివాదాస్పద దర్శక నిర్మాత రామ్‌‌గోపాల్‌వర్మ.

Updated Date - 2023-03-01T13:50:54+05:30 IST